Advertisement
Advertisement
Abn logo
Advertisement

లాట్‌ మొబైల్స్‌ ప్రత్యేక ఆఫర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): సంక్రాంతి సందర్భంగా లాట్‌ మొబైల్స్‌ కొనుగోలుదారులకు ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ కార్డు ద్వారా మొబైల్‌ కొనుగోలు చేస్తే 5 శాతం వరకూ ఇన్‌స్టంట్‌ క్యాష్‌ బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు లాట్‌ మొబైల్స్‌ డైరెక్టర్‌ యం అఖిల్‌ తెలిపారు. స్మార్ట్‌ టీవీలపై రూ.7,000 వరకూ, హెచ్‌పీ, రియల్‌మీ లాప్‌టా్‌పలపై రూ.2,500 వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఇస్తున్నట్లు చెప్పారు. సులభ వాయిదాల్లో కొనుగోలు చేసే వెసులుబాటు, స్మార్ట్‌ టీవీ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ వంటి వాటిని కూడా సంక్రాంతి సందర్భంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్మార్ట్‌ టీవీపై రూ.3,500 వరకూ ఎక్స్ఛేంజీ ఆఫర్‌ చేస్తున్నారు. బ్రాండెడ్‌ యాక్ససరీలు, సామ్‌సంగ్‌, నోకియా, రియల్‌మీ మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌లపై కూడా ఆఫర్లను ప్రకటించారు. 

Advertisement
Advertisement