ప్రైవేటీకరణతో నష్టం

ABN , First Publish Date - 2022-08-11T05:32:57+05:30 IST

తపాలా శాఖను ప్రైవేటీకరిస్తే ప్రజలు దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోతుందని, దీనివల్ల నష్టం కలుగుతుందని ఏఐపీఈయూ జీడీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.నందికేశ్వరరావు అన్నారు. తపాలా శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కాశీబుగ్గ తపాలా కార్యాలయం ఆవరణలో కాశీబుగ్గ, పలాస, పూండి, బ్రాహ్మణతర్లా, అక్కుపల్లి కార్యాలయాల ఎస్‌వోలు, బీవోలు సిబ్బంది సమ్మె చేశారు.

ప్రైవేటీకరణతో నష్టం
కాశీబుగ్గ తపాలా శాఖ కార్యాలయం ఆవరణలో సమ్మెలో పాల్గొన్న సిబ్బంది

కాశీబుగ్గ: తపాలా శాఖను ప్రైవేటీకరిస్తే ప్రజలు దాచుకున్న సొమ్ముకు భద్రత లేకుండా పోతుందని, దీనివల్ల నష్టం కలుగుతుందని ఏఐపీఈయూ జీడీఎస్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.నందికేశ్వరరావు అన్నారు. తపాలా శాఖ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం కాశీబుగ్గ తపాలా కార్యాలయం ఆవరణలో కాశీబుగ్గ, పలాస, పూండి, బ్రాహ్మణతర్లా, అక్కుపల్లి కార్యాలయాల ఎస్‌వోలు, బీవోలు సిబ్బంది సమ్మె చేశారు. కార్యక్రమంలో తపాలా ఉద్యోగుల ఐక్య వేదిక సభ్యులు వేమన, దుర్యోధన, శ్రీనివాస్‌రావు, రాజేష్‌, గురుమూర్తి, తేజేశ్వరరావు, గణపతి, గోపా లరావు, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.  

విధులు బహిష్కరించి..
పాతపట్నం:
తపాలాశాఖ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఎన్‌ఎఫ్‌పీ యూనియన్‌ అసిస్టెంట్‌ సెక్ర టరీ పి.గిరిబాబు కోరారు. స్థానిక పోస్టాఫీస్‌ వద్ద విధులు బహిష్కరించి ఉద్యోగులు సమ్మె చేశారు. పాత ఫింఛన్‌ విధానం కొనసాగించాలని, డాక్‌మిత్ర నిలుపుదలకు వ్యతిరేకం గానినాదాలు చేశారు. పోస్టుమాస్టర్‌ టి.మధు, పోస్టల్‌ అసిస్టెంట్‌ కె.రాజు తదితరులుపాల్గొన్నారు.
 
 

Updated Date - 2022-08-11T05:32:57+05:30 IST