నష్టాల నుంచి కోలుకునే మార్గాలు వెతకాలి

ABN , First Publish Date - 2021-06-23T05:20:31+05:30 IST

కొవిడ్‌-19 కారణంగా ప్రపంచంలోని అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని, వాటి నుంచి కోలుకునే మార్గాలను ఆర్థి కవేత్తలు, వ్యాపారులు, మేథావులు అన్వేషించాలని నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు కోరారు.

నష్టాల నుంచి కోలుకునే మార్గాలు వెతకాలి

దివాన్‌చెరువు, జూన్‌ 22: కొవిడ్‌-19 కారణంగా ప్రపంచంలోని అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయని, వాటి నుంచి కోలుకునే మార్గాలను ఆర్థి కవేత్తలు, వ్యాపారులు, మేథావులు అన్వేషించాలని నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి మొక్కా జగన్నాథరావు కోరారు. వర్శిటీలో లైఫ్‌ సైన్సెస్‌ విభాగం ఆధ్వర్యంలో ‘కొవిడ్‌-19 ఇంపేక్ట్‌ ఆన్‌ ఆక్వాకల్చర్‌ ప్రాక్టీసెస్‌’ అంశంపై విభాగా ధిపతి పి.విజయనిర్మల కన్వీనర్‌గా మంగళవారం జాతీయ వెబినార్‌ నిర్వ హించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ ఆక్వాకల్చర్‌ పరిశ్ర మపై కొవిడ్‌ మహమ్మారి ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. మార్కె టింగ్‌, రవాణా, స్టోరేజ్‌ వంటి కీలక అంశాలతో ముడిపడిన కారణంగా అధిక నష్టాలను చవిచూశారన్నారు. మత్స్యశాఖ విశ్రాంత డీడీ పి.రామమోహన రావు ఎస్వీ విశ్వవిద్యాలయం మత్స్యశాఖ విశ్రాంత ఫ్యాకల్టీ ఆచార్య పి.హరి బాబు, నాగార్జున విశ్వవిద్యాలయం ఆక్వా కల్చర్‌ విభాగానికి చెందిన ఆచార్య కె.వీరయ్య, అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్‌ సైంటిస్టు బిబా చతియాబోరే వివిధ అంశాలపై ప్రసంగించారు. రిజిస్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌, ప్రిన్సిపాల్‌ కె.రమణేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:20:31+05:30 IST