Abn logo
Jun 6 2020 @ 20:40PM

సక్సెస్‌మీట్‌లో ‘లూజర్’

దేశవ్యాప్తంగా వివిధ భాషలలో అధిక వెబ్ సిరీస్‌లను నిర్మిస్తున్న జీ5 ఇటీవలే ‘అమృతం ద్వితీయం’ అంటూ అప్పటి ‘అమృతం’కు సీక్వెల్‌ను వెబ్ సిరీస్ రూపంలో తీసుకువచ్చారు. దీనితో పాటు మరో వెబ్ సిరీస్‌ను కూడా వారు విడుదల చేశారు. అదే ‘లూజర్’. ఒక స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఇందులో క్రికెటర్, బ్యాడ్మింటన్ ప్లేయర్, రైఫిల్ షూటర్ అవ్వాలి అనుకునే ముగ్గురు వ్యక్తులు.. ఆటలలో ఉండే రాజకీయాల వల్ల ఎలా ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలను ఎదురుకున్నారు అనే కథతో చిత్రీకరించారు. ఇందులో ప్రియదర్శి, కల్పిక, షియాజి షిండే, శశాంక్ ముఖ్య పాత్రలలో నటించారు. లూసర్‌కు అభిలాష్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ వారు దీన్ని నిర్మించారు. మార్చి‌లో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘లూజర్’, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చాలా పెద్ద హిట్ అయింది. ఊహించని విధంగా అతి పెద్ద సక్సెస్ అందుకున్న సందర్భంగా శనివారం ఈ వెబ్ సిరీస్ యూనిట్ సక్సెట్‌మీట్‌ నిర్వహించారు. 


వెబినార్‌లో జరిగిన ఈ సక్సెస్ మీట్‌లో ‘జీ 5’ క్రియేటివ్‌ హెడ్‌ ప్రసాద్‌ నిమ్మకాయల, దర్శకుడు అభిలాష్, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్‌లతో పాటు వెబ్ సిరీస్‌లో నటించిన ప్రియదర్శి, కల్పిక, శశాంక్, యానీ, పావని, కోమలి తదితరులు పాల్గొన్నారు. వీరంతా ఈ వెబ్ సిరీస్‌తో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. అంతేకాకుండా మీడియా ప్రతినిధులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ‘లూజర్’ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement