Abn logo
Sep 18 2021 @ 06:47AM

ట్రక్కు డ్రైవర్‌ జీతం రూ. 72 లక్షలు... కారణం తెలిస్తే షాకవుతారు!

లండన్: బ్రిటన్‌లోని సూపర్ మార్కెట్లలో ట్రక్కు డ్రైవర్లకు ఇస్తున్నంత జీతం మన దేశంలోని ఉన్నతస్థాయిలో ఉన్న ఇంజినీర్లకు సైతం లభించడం లేదు. ఇది నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ నిజం ఇదే. బ్రిటన్‌లోని ఒక ప్రముఖ సూపర్ మార్కెట్‌లో సరుకులు డెలివరీ చేసే ట్రక్కు డ్రైవర్ వార్షిక ఆదాయం 70 వేల పౌండ్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.70 లక్షల 88 వేల 515. 

ఇంతేకాదు వీరికి 2 వేల పౌండ్లు (సుమారు రూ.2,02,612) బోనస్‌గా లభిస్తుంది. టెస్కో, సెన్స్‌బరీ తదితర కంపెనీలకు చెందిన రిక్రూటర్లు... ట్రక్కు డ్రైవర్లకు మంచి జీతం ఆఫర్ చేస్తున్నారు. దేశంలో లక్షకు పైగా ట్రక్కు డ్రైవర్ల అవసరం ఉంది. ఈ నేపధ్యంలోనే అనుభవం కలిగిన ట్రక్కు డ్రైవర్లకు ఆకర్షణీయమైన జీతాలిచ్చి పనుల్లో కుదుర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ట్రక్కు డ్రైవర్ బెర్రీ మాట్లాడుతూ తనకు ఏజెంట్ల ద్వారా మంచి జీతంతో పాటు బోనస్‌గా రెండు వేల పౌండ్లు ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నాయని తెలిపారు. వారంలో ఐదు రోజుల పాటు నైట్ డ్యూటీ చేయాల్సివుంటుందని, ఇటువంటి సమయంలో అదనపు ఆదాయం వస్తుందన్నారు. తన బాస్ కూడా ఇంత జీతం తీసుకోవడం లేదన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...