లారీ దొంగలు అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-08-14T06:48:56+05:30 IST

జల్సాల కోసం చేసిన అప్పులను తీర్చే మార్గం లేక దొంగతనాలకు అలవాటుపడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లను సుల్తానా బాద్‌ పోలీసులు పట్టుకు న్నారు.

లారీ దొంగలు అరెస్ట్‌
చోరీకి గురైన లారీని, నిందితులను పట్టుకున్న పోలీసులు

-లారీ, సెల్‌ఫోన్‌, మూడు వేల నగదు స్వాధీనం

పెద్దపల్లి టౌన్‌/సుల్తానాబాద్‌ ఆగస్టు 13: జల్సాల కోసం చేసిన అప్పులను తీర్చే మార్గం లేక దొంగతనాలకు అలవాటుపడ్డ ఇద్దరు లారీ డ్రైవర్లను సుల్తానా బాద్‌ పోలీసులు పట్టుకు న్నారు. వారి వద్ద నుంచి చోరీకి గురైన లారీని  స్వాధీనం చేసుకున్నా రు. ఈ సందర్భంగా తన కార్యాలయంలో శనివారం విలేక రుల సమావేశం ఏర్పాటుచేసి ఏసీపీ సాదుల సారంగపాణి మాట్లాడారు. జల్సాలకు అలవా టుపడి లారీల దొంగతనాలను ఎంచకు న్నట్లు, పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గతంలో లారీ దొంగిలించినట్లు తెలిపారు. ఈ నెల 10న సుల్తానాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. వాలేపు బాలం, జ్వాల ఇద్దరు బావ బామ్మర్దు లు  పదిహేను ఏళ్లుగా సొంత లారీలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లారీలు నడిపిస్తే వచ్చే సొమ్ముతో ఫైనాన్స్‌లు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఫైనాన్స్‌తో బయట అప్పులు తీర్చాలంటే భారంగా మారింది. దీంతో లారీలను దొంగిలించేందకు నిర్ణయం తీసుకున్నారు. కాట్నపల్లి వద్ద లారీ నిలిపి ఉంది. అక్కడ ఎవరు లేకపోవడంతో లారీని దొంగలించి ఖమ్మం వైపు తీసుకెళ్లారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లి  అక్కడ  ఫిరోజ్‌కు మూడులక్షల రూపాయలకు విక్రయించారు. గతంలో కూడా ఇదే వ్యక్తి లారీని అమ్మిన చరిత్ర ఉందని ఏసీపీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను అదుపులోకి తీసకున్నట్లు వారి నుంచి ఒక లారీ, సెల్‌ ఫోన్‌, మూడువేల నగదు స్వాధీనం చేసకున్న ట్లు వివరించారు. సమావేశంలో సీఐ ఇంంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్‌ అశోక్‌రెడ్డి, సిబ్బంది లచ్చిరెడ్డి, కమలాకర్‌, కిరణ్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T06:48:56+05:30 IST