లారీ ఓనర్ల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-29T05:18:04+05:30 IST

కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకు నిరసనగా రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు కాకినాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం లారీలు నిలిపి వేసి ధర్నా నిర్వహించారు.

లారీ ఓనర్ల ఆందోళన

కాకినాడ సిటీ, అక్టోబరు 28: కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకు నిరసనగా రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు కాకినాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం లారీలు నిలిపి వేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నడింపల్లి శ్రీనివాసరాజు మాట్లాడుతూ తక్షణం డీజిల్‌, పెట్రోల్‌పై పన్నులు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌  చేశారు. రోడ్డు సెస్‌తో రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేయించాలన్నారు. కనీసం రెండు క్వార్టర్లు ట్యాక్స్‌లు మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి మట్టా రాంబాబు, కోశాధికారి పైల రామచంద్రరావు, ఉపాధ్యక్షుడు మందల వీరప్రతాప్‌కుమార్‌, చిక్కాల సుధాకర్‌, సంయుక్త కార్యదర్శులు కొవ్వూరి సుధాకరరెడ్డి, వరిపల్లి శివనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T05:18:04+05:30 IST