వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ

ABN , First Publish Date - 2021-04-17T05:20:16+05:30 IST

ట్రాక్టర్‌ను ఢీకొట్టి లారీ డ్రైవర్‌ కేబిన్‌లో చిక్కు కుపోయాడు.

వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన లారీ

లారీ కేబిన్‌లో చిక్కుకుపోయిన డ్రైవర్‌ ..కాపాడిన పోలీసులు

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 16: ట్రాక్టర్‌ను ఢీకొట్టి లారీ డ్రైవర్‌ కేబిన్‌లో చిక్కు కుపోయాడు. పాలకొల్లు బ్రాడీపేట కుళాయి చెరువు వద్ద (మార్టేరు – నరసాపురం రోడ్డు) శుక్రవారం తెల్లవారుజామున ట్యాంకర్‌లో నీళ్లు నింపుకు ంటున్న ట్రాక్టర్‌ను మార్టేరు వైపు నుంచి నరసాపురం వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో లారీ ముందు భాగం దెబ్బతినడంతో తాళ్ళపూడి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్‌ సీహెచ్‌ నరసింహారావు కేబిన్‌లో చిక్కుకుపోయాడు. ఈ మేరకు సమాచారం అందడంతో పట్టణ హెడ్‌ కానిస్టేబుల్‌ సత్యనారాయణ సిబ్బందితో హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, ఎక్స్‌కవేటర్‌ సహాయంతో కేబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ నరసింహారావును బయటకు తీశారు. స్వల్పగాయాలు కావడంతో చికిత్స నిమి త్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ సీహెచ్‌ ఆంజనేయులు పర్యవేక్ష ణలో కేసు నమోదు చేసినట్టు హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ తెలిపారు. 

Updated Date - 2021-04-17T05:20:16+05:30 IST