వేణుగోపాలుడి గ్రామోత్సవం

ABN , First Publish Date - 2021-01-14T05:14:49+05:30 IST

తూర్పువీధికి చెందిన యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా సంప్రదాయ ప్రకారం రెండెడ్ల బండిపై వేణుగోపాలస్వామి గ్రామోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు.

వేణుగోపాలుడి గ్రామోత్సవం
ఏలూరు పురవీధుల్లో వేణుగోపాలస్వామి గ్రామోత్సవం

ఏలూరు కార్పొరేషన్‌, జనవరి 13 : తూర్పువీధికి చెందిన యాదవ యువజన సంఘం ఆధ్వర్యంలో భోగి పండుగ సందర్భంగా సంప్రదాయ ప్రకారం రెండెడ్ల బండిపై వేణుగోపాలస్వామి గ్రామోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. గత వందేళ్లగా   తంగెళ్ళమూడిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి తూర్పువీధి యాదవ సంఘ నాయ కులు, యువజన సంఘ సభ్యులు రెండెడ్ల బండిని తీసుకువచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ జరపడం సంప్రదాయంగా వస్తుంది. యాదవ సంఘం గౌరవాధ్యక్షుడు కొల్లిపర శ్రీనివాసరావు(సీతయ్య), అధ్యక్షుడు చీదరబోయిన వెం కటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నెరుసు గోపాలకృష్ణ, కోశాధికారి కిలారపు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కిలారపు పాండురంగారావు, సహాయ కార్యదర్శి బూసి నాగరాజు, కార్యవర్గ సభ్యులు గొరిపర్తి రాఘవేంద్రరావు, విజయకుమార్‌, నాగేంద్ర, శ్రీకాంత్‌, కోటేశ్వరరావు పాల్గొన్నారు. వీధివీధినా భక్తులు స్వామిని దర్శించుకుని హారతులిచ్చి ఆరాధించారు. 

Updated Date - 2021-01-14T05:14:49+05:30 IST