Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీలకర్ర కంటే చిన్నసైజులో పంచలోహ శివలింగం

  • ఐదు గంటల్లో తయారుచేసిన మండపేట సూక్ష్మ కళాకారుడు

మండపేట, డిసెంబరు 2: పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, స్వర్ణకారుడు అండలూరి వీరవెంకట సత్యనారాయణ పంచలోహాలతో జీలకర్ర కంటే చిన్న సైజు లో శివలింగం తయారు చేశాడు. ద్రాక్షారామ భీమేశ్వరస్వామి శివలింగం నమూ నాను బుధవారం ఉదయం 11 గంటలకు తయారీ ప్రారంభించి ఐదు గంటల్లో 0.6 మి.మీ. పొడవు, 3.50 మి.మీ. వెడల్పుతో 0.40 మిల్లీ గ్రాముల పంచలోహాలతో రూ పొందించాడు. దీనికి వెండి నేత్రాన్ని కూడా అమర్చాడు. శివలింగం తయారీకి అవ సరమైన వస్తువులను తానే స్వయంగా నవంబరు 20 నుంచి  సొంతంగా తయారు చేసుకున్నానని సత్యనారాయణ గురువారం విలేకరులకు తెలి పాడు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు దక్కించుకోవడమే తన లక్ష్యమని ఆయన చెప్పాడు.

Advertisement
Advertisement