Apr 22 2021 @ 01:06AM

కశ్మీర్‌లో రాముడు

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమా సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. హను రాఘవపూడి దర్శకుడు. శ్రీరామ నవమి సందర్భంగా సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల చేశారు. ‘‘ప్రేమ కోసం ఆ శ్రీరాముని యుద్ధం చిరస్మరణీయం. త్వరలో తన ప్రేమకావ్యంతో మన ముందుకు మా లెఫ్ట్‌నెంట్‌ రామ్‌ వస్తాడు. చెడుపై మంచి విజయం సాధిస్తుంది. అప్పటివరకూ స్టే సేఫ్‌’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో మద్రాస్‌ ఆర్మీ అధికారి లెఫ్ట్‌నెంట్‌ రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం కశ్మీర్‌లో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి కెమెరా: దివాకర్‌ మణి, సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్‌.