మొండి వ్యాధులు నయం కావాలంటే...

ABN , First Publish Date - 2020-06-05T05:30:00+05:30 IST

పరమేశ్వరుణ్ణి ‘ఆది వైద్యుడు’ అంటారు. ఆయనను ఆరాధించి మార్కండేయుడు మృత్యుంజయుడయ్యాడు. శివుడు వైద్యవిద్యకు అధినాధుడైన ‘వైద్యనాథుడి’గా కొలువైన క్షేత్రం తమిళనాడులోని చిదంబరానికి దగ్గరలో నెలకొన్న వైదీశ్వరన్‌ కోయిల్...

మొండి వ్యాధులు నయం కావాలంటే...

పరమేశ్వరుణ్ణి ‘ఆది వైద్యుడు’ అంటారు. ఆయనను ఆరాధించి మార్కండేయుడు మృత్యుంజయుడయ్యాడు. శివుడు వైద్యవిద్యకు అధినాధుడైన ‘వైద్యనాథుడి’గా కొలువైన క్షేత్రం తమిళనాడులోని చిదంబరానికి దగ్గరలో నెలకొన్న వైదీశ్వరన్‌ కోయిల్‌. అక్కడి అమ్మవారి పేరు వాలాంబిక.  ఆ స్వామిని ప్రస్తుతిస్తూ ఆదిశంకరులు శ్రీ వైద్యనాథాష్టకం రచించారు. ఈ శ్లోకాల మాలికలో ప్రతి శ్లోకం చివరా స్వామికి నమస్కారం చేయడం శుభ ఫలితాలిస్తుందని పెద్దల మాట. 


శ్రీ వైద్యనాథాష్టకం

శ్రీరామ సౌమిత్రి జటాయు వేద, షడాననాదిత్య కుజార్చితాయ 

శ్రీనీలకంఠాయ దయామయాయ, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (1)

గంగాప్రవాహేందు జటాధరాయ, త్రిలోచనాయ స్మర కాలహంత్రే 

సమస్త దేవైరపి పూజితాయ, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (2)

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ, పినాకినే దుష్టహరాయ నిత్యమ్‌

ప్రత్యక్ష లీలాయ మనుష్యలోకే, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (3)

ప్రభూతవాతాది సమస్తరోగ, ప్రణాశకరే్త్ర మునివందితాయ

ప్రభాకరేంద్వగ్నివిలోచనాయ, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (4)

వాక్ర్శోరత్ర నేత్రాంఘ్రి విహీనజంతోః, వాక్ర్శోరత్రనేత్రాంఘ్రి సుమఖప్రదాయ

కుష్ఠాది సర్వోన్నత రోగహంత్రే, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (5)

వేదాంత వేద్యాయ జగన్మయాయ, యోగీశ్వరధ్యేయ పదాంబుజాయ

త్రిమూర్తిరూపాయ సహస్రనామ్నే, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (6)

స్వతీర్థ మృత్‌ భస్మభృదంగభాజాం, పిశాచ దుఃఖార్తి భయాపహాయ

ఆత్మ స్వరూపాయ శరీరభాజాం, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (7)

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ, స్రగ్గంధభస్మాదపి శోభితాయ

సుపుత్ర దారాది సుభాగ్యదాయ, శ్రీవైద్యనాథాయ నమః శివాయ (8)

బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతి చ

జపేన్నామ త్రయం నిత్యం మహారోగనివారణమ్‌ (9)


ఇతి శ్రీ వైద్యనాథాష్టకమ్‌

ఈ అష్టకాన్ని రోజూ మూడు వేళలా పఠించి, శివుణ్ణి భక్తితో ప్రార్థిస్తే ఎలాంటి మొండి వ్యాధులైనా నయం అవుతాయనీ, మరణభయం పోతుందనీ అనాదిగా ఉన్న విశ్వాసం.


Updated Date - 2020-06-05T05:30:00+05:30 IST