Abn logo
Mar 6 2021 @ 20:48PM

క్యూఆర్ కోడ్‌ స్కాన్ పేరుతో లూటీ

హైదరాబాద్: క్యూఆర్ కోడ్‌ స్కాన్ పేరుతో మరోమారు సైబర్ నేరగాళ్లు  మోసం చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పి బ్యాంక్ ఖాతా నుంచి రూ.3లక్షలను మోసగాళ్లు కాజేశారు. తనకు ఓ బుక్ కావాలని అమెజాన్‌ ఆన్‌లైన్‌లో ఒక మహిళ ఆర్డర్ చేసింది. అయితే రోజులు గడుస్తున్నా తాను ఆర్డర్ చేసిన బుక్ డెలవరీ కాలేదు. దీంతో గూగుల్‌లో సెర్చ్ చేసి అమెజాన్ కస్టమర్ కేర్ నెంబర్‌కు మహిళ కాల్ చేసి తన సమస్యను వివరించింది. వస్తువు స్టాక్ లేదని డబ్బులు రిటర్న్ చేస్తామని ఆమెను నేరగాళ్లు నమ్మించారు. 

తాము పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని ఆమెకు నేరగాళ్లు వివరించారు. కొంతసేపటి తరువాత వారు పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే ఆమె బ్యాక్ ఖాతా నుంచి రూ.3 లక్షలను మోసగాళ్లు కాజేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అయినట్టు ఆ మహిళ ఫోన్‌కు బ్యాంకు నుంచి మెస్సేజ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ మహిళా బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

క్రైమ్ మరిన్ని...