భయంకరమైన దాడిలా ఉంది.. బీరుట్ పేలుడుపై ట్రంప్!

ABN , First Publish Date - 2020-08-05T22:21:21+05:30 IST

లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన భారీ పేలుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

భయంకరమైన దాడిలా ఉంది.. బీరుట్ పేలుడుపై ట్రంప్!

వాషింగ్టన్: లెబనాన్‌లోని బీరుట్‌లో జరిగిన భారీ పేలుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్మీ అధికారుల అభిప్రాయం ప్రకారం, బీరుట్‌లో జరిగింది పేలుడు కాదని, ఏదో బాంబు వల్లే జరిగిందని ట్రంప్ చెప్పారు. ‘బీరుట్ ఘటన ఏదో పరిశ్రమలో జరిగిన పేలుడులా కనిపించడంలేదు. యూఎస్ జనరల్స్ అభిప్రాయంలో ఇదేదో బాంబు దాడిలా ఉంది’ అని ట్రంప్ పేర్కొన్నారు. అది ఓ భయంకరమైన దాడిలానే కనిపిస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Updated Date - 2020-08-05T22:21:21+05:30 IST