క్రిమినల్స్‌ కన్నా హీనంగా చూశారు

ABN , First Publish Date - 2022-05-10T08:44:34+05:30 IST

మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీ నవనీత్‌ రాణా (స్వతంత్ర) సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు.

క్రిమినల్స్‌ కన్నా హీనంగా చూశారు

మహారాష్ట్ర పోలీసులపై స్పీకరుకు ఎంపీ నవనీత్‌ ఫిర్యాదు 

ఢిల్లీ, ముంబై, మే 9: మహారాష్ట్ర పోలీసులు తమ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎంపీ నవనీత్‌ రాణా (స్వతంత్ర) సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఒక కేసులో తనతో పాటు, ఎమ్మెల్యే అయిన భర్త రవి రాణాను అరెస్టు చేసిన పోలీసులు లాక్‌పలోనూ, జైలులోనూ అమర్యాదకరంగా వ్యవహరించారని తెలిపారు. క్రిమినల్స్‌ కన్నా హీనంగా చూశారని అంతకుముందు ముంబైలో జరిగిన మీడియా సమావేశంలోనూ ఆరోపించారు. నవనీత్‌ రాణా మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి ఎంపీగా, ఆమె భర్త రవి అమరావతి జిల్లా బడ్నేరా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఆ దంపతులిద్దరూ స్పీకరుతో 45 నిమిషాలు సమావేశమై జరిగిన సంఘటనలను వివరించారు. ఈ నెల 23న తన ఫిర్యాదును లోక్‌సభ హక్కుల కమిటీ పరిశీలిస్తుందని, తాను లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ సమర్పిస్తానని ఆమె చెప్పారు. ఆమె అరెస్టుపై వాస్తవాలు పంపించాలని ఇప్పటికే లోక్‌సభ కార్యాలయం కేంద్ర హోం శాఖ ద్వారా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.

Read more