ఆ రెండు నియోజకవర్గాలపై నజర్‌

ABN , First Publish Date - 2021-10-23T06:22:19+05:30 IST

పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయాల్లో మళ్లీ దూకుడు పెం చారు.

ఆ రెండు నియోజకవర్గాలపై నజర్‌
మఠంపల్లి మండలం గుర్రంబోడు తండాలో గిరిజనులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌ (ఫైల్‌)

 హుజూర్‌నగర్‌, కోదాడపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఉత్తమ్‌
 ఆత్మీయ సమ్మేళనాల పేరుతో అధికార పార్టీ టార్గెట్‌
నల్లగొండ, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయాల్లో మళ్లీ దూకుడు పెం చారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆరున్నరేళ్ల పాటు పనిచేయాల్సి రావడంతో రెండు సొంత నియోజకవర్గాలకు ఆయన దూరమయ్యారు. దీనికి తోడు హుజూర్‌నగ ర్‌, కోదాడ నియోజకవర్గాల్లో అధికార పార్టీ అన్నీ మార్గాల్లో బలాన్ని పెంచుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు ఢీలాపడే పరిస్థితి నెలకొనగా, మరోవైపు ముందస్తు ఎన్నికల చర్చ, గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో కోదాడ చేజారడం వం టి పరిణామాలను బేరీజు వేసుకుని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మళ్లీ వేగం పెంచారు. వరుస కార్యక్రమాలతో అధికార పార్టీని టార్గెట్‌ చేస్తూ రెండు నియోజకవర్గా ల్లో మాటల దాడి పెంచడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడయ్యాక హుజూర్‌నగ ర్‌, కోదాడ నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో ఆయనకు కొంత దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు దూకుడు పెంచారు. కాంగ్రెస్‌ నుంచి నేతల చేరికలు, బలమైన నాయకులపై పోలీ స్‌ కేసులు, గుర్రంబోడు వంటి భూ వివాదాలు, అట వీ భూముల ఆక్రమణ వంటి అంశాలపై అధికార పార్టీతో పోరాడే క్రమంలో కాంగ్రెస్‌ నేతలు ఇబ్బందులకు గురయ్యారు. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక తిరిగి కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల పై దృష్టి మళ్లించారు. తొలుత ఎంపీగా జిల్లా పరిషత, మునిసిపాలిటీలు, అన్ని మండల జనరల్‌ బాడీ సమావేశాలకు హాజరయ్యేలా షెడ్యూల్‌ ఖరారు చేసుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీపీలు ఉన్న మండలాల కు తొలి ప్రాధాన్యం ఇస్తూ కీలక నేతల అన్ని మంచి, చెడు కార్యక్రమాలకు హాజరవుతున్నారు. మరోవైపు ఎంపీగా రైల్వే స్టేషన్లలో పర్యటించి అక్కడి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల సమస్య, పెండింగ్‌లో ఉన్న, కొత్త రహదారుల మం జూరుపై దృష్టిపెట్టారు. ప్రజల వైద్య ఇబ్బందులు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లు తదితర కార్యక్రమాల పర్యవేక్షణకు హైదరాబాద్‌ కార్యాలయంలో ప్రత్యేకంగా ముగ్గురు పీఏలను ఏర్పాటు చేశారు.
మాటల తూటాలు, సమ్మేళనాలు
ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, ఆరున్నరేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కు అవకాశం దొరికిందంటే అది కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల కారణంగానే. ఈ నేపథ్యంతోనే ఆయన ఆ రెండు నియోజకవర్గాలపై ఆరు నెలలుగా ప్రత్యేక దృష్టి పెట్టారు. అధికార పార్టీ నుంచి కాంగ్రెస్‌ నేతలపై వివిధ రకాల ఒత్తిళ్లు వస్తున్న క్రమంలో వారంతా నిలబడి ఎదుర్కొనేందుకు ఉత్తమ్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ క్రమంలోనే మఠంపల్లిలో గుర్రంబోడు గిరిజనుల భూముల అంశం, హుజూర్‌నగర్‌లో మునిసిపల్‌ లేఔట్ల అమ్మకాలు, పాలకవీడు, మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో అటవీ భూ ములను అధికార పార్టీ నేతలు అన్యాక్రాంతం చేశారంటూ బహిరంగంగా కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల కార్యక్రమాలకు ఎంపీ సంతో్‌షకుమార్‌ అండదండలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకు తనవద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, సీబీసీఐడీ చేత విచారణ చేయించాలని ఉత్త మ్‌ సవాల్‌ విసిరారు. గుర్రంబోడు భూములపై ఉత్త మ్‌ దృష్టిపెట్టాక బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ పర్యటన తో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుస కార్యక్రమాలు అనంతరం ఈనెల 18న నేరేడుచర్లలో హుజూర్‌నగర్‌ నేతలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించగా, స్పందన కనిపించింది.
దీంతో కోదాడలో ఈనెల 25న నియోజకవర్గ నేతలతో ఉత్తమ్‌ దంపతులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కోదాడ నియోజకవర్గంలోని అధికార పార్టీ నేతల భూకబ్జాలు, మద్యం అధిక ధరలకు విక్రయం, కాంగ్రెస్‌ నేతలపై కక్ష సాధింపు ధోరణులకు వ్యతిరేకంగా కోదాడ సమావేశంలో చర్చించాలని, ఆ తర్వాత వరుస కార్యక్రమాలు నిర్వహించాలన్నది ఉత్తమ్‌ వ్యూహం. ఈ క్రమంలోనే పోలీస్‌ అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకులోనై కాంగ్రెస్‌ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, దీనిపై జైలు భరో వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఏపీ తరహాలో ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చుకోవడం, ఆ తర్వాత అధికారులపైనా ఆరోపణలు చేయడం, అధికార పార్టీ నేతల భూముల్లోకి, నిర్మించిన చెక్‌డ్యాంలను సందర్శించి ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నుంచి అంతే ఘాటుగా స్పందనలు ఉండటంతో వచ్చే రోజుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో వాతావరణం మరింత వేడెక్కనుంది.

Updated Date - 2021-10-23T06:22:19+05:30 IST