ఇక మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి

ABN , First Publish Date - 2021-04-16T07:19:44+05:30 IST

కొవిడ్‌ రోగుల చికిత్సలో అత్యంత కీలకమైన మెడికల్‌ ఆక్సిజన్‌కు ఎక్కడా కొరత రాకుండా

ఇక మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి

100 ప్లాంట్లకు పీఎం కేర్స్‌ నుంచి నిధులు : కేంద్రం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: కొవిడ్‌ రోగుల చికిత్సలో అత్యంత కీలకమైన మెడికల్‌ ఆక్సిజన్‌కు ఎక్కడా కొరత రాకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. నానాటికీ కేసులు పెచ్చరిల్లుతుండడంతో 50, 000 మిలియన్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ను దిగుమతి చేసుకోవాలని నిశ్చయించింది. ‘‘కేసుల ఒత్తిడి అత్యధికంగా ఉన్న  12 రాష్ట్రాలను సాధికారిక బృందం గుర్తించింది.


వీటిలో ఉన్న 100 ఆసుపత్రుల్లో తగు సంఖ్యలో ఆక్సిజన్‌ నిల్వలు లేనట్లూ తెలుసుకుంది. ఈ ఆసుపత్రులు సొంతంగా మెడికల్‌ ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పుకొనేందుకు పీఎం కేర్స్‌ నిధి నుంచి నిధులు సమకూర్చనున్నాం. ఇది కాక మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి కూడా త్వరితగతిన చేపట్టనున్నాం’’ అని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. 


Updated Date - 2021-04-16T07:19:44+05:30 IST