బహుదూరం

ABN , First Publish Date - 2022-06-02T04:48:49+05:30 IST

బహుదూరం

బహుదూరం
మందిపాల్‌ గ్రామానికి 4 కిలో మీటర్ల దూరంలో ఉన్న పల్లెప్రకృతి వనం

  •  స్థలం కొరతతో  గ్రామానికి దూరంగా పల్లె ప్రకృతి వనాలు
  •  కొన్ని చోట్ల1 కి. మీ నుంచి 4 కి. మీ దూరంలో ఏర్పాటు
  • మరొకొన్ని  ఇతర గ్రామాల శివారుల్లో ..

కులకచర్ల, జూన్‌1: గ్రామాల మద్యలో లేదా శివారులో ఏర్పాటు చేయాల్సిన పల్లె ప్రకృతి వనాలు స్థల సమస్య కారణంగా గ్రామాలకు దూరంగా నిర్మించారు. మరికొన్నింటిని ఇతర గ్రామాల పరిధిలో ఏర్పాటు చేశారు. ముందు చూపు లేకుండా అధికారులు గ్రామానికి దూరంగా వీటిని ఏర్పాటు చేయడంతో ప్రజలు వాటిని ఉపయోగించడం లేదు. లక్షల రూపాయలు ఖర్చు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రజల ఆదరణ కోల్పోతున్నాయన్నారు. కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల పరిధిలోని 44 గ్రామ పంచాయతీలతో పాటు 15 అనుబంధ గ్రామాల్లో  పల్లె పకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్మాణాలకు రూ.27 లక్షల 16,531 ఈజీఎస్‌ నిఽధులు ఖర్చు చేఽశారు. గ్రామ పరిధిలో ఎకరం విస్తీర్ణంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ గ్రామ పరిధిలో ఎకరం భూమి లేకపోవడం కారణంగా అధికారుల ఒత్తిడి వల్ల కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా వీటిని ఏర్పాటు చేశారు. తిర్మలాపూర్‌, ఇప్పాయిపల్లి, మందిపాల్‌, లాల్‌సింగ్‌తండా, పటేలుచెరువుతండా, ముజాహిత్‌పూర్‌, చౌడాపూర్‌, మక్తవెంకటాపూర్‌ గ్రామాలతో పాటు చాలా గ్రామాల పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేశారు. మరికొన్ని ఇతర గ్రామాల శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 

రూ.లక్షలు వెచ్చించినా..

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించినాఫలితం లేకపోయింది. మండల పరిధిలోని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసినా వాటిని ఉపయోగించుకోవడం లేదు. పల్లె ప్రకృతి వనం ఎకరం భూమిలో 1000 మొక్కలు పెంచాలని ఉన్న క్షేత్రస్థాయిలో అది సాధ్యం కావడం లేదు. పేరుకు మాత్రమే పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన వాటిని ఉపయోగించుకోకపోవడంతో నిరుపయోగంగా మారాయి.  

స్థలం అందుబాటులో లేనందునే..: కృష్ణ, సర్పంచ్‌ అంతారం

గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి లేకపోవడంలో కిలో మీటరు దూరం చెరువు ప్రాంతంలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశాం. మొక్కలు నాటి నీరు అందిస్తున్నాం. కూలీలకు డబ్బులు అందలేదు. గ్రామానికి దూరంగా ఉండటంతో దీన్ని ఎవరు ఉపయోగించడం లేదు. 


Updated Date - 2022-06-02T04:48:49+05:30 IST