జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే... ఇలా చేయండి!

ABN , First Publish Date - 2022-02-26T16:43:19+05:30 IST

ఒత్తైన జుట్టు ఉండాలంటే.. ప్రొటీన్లు, విటమిన్లు ఉండే మంచి ఆహారం తినాలి. జుట్టు త్వరగా, పొడవుగా పెరిగేందుకు ఈ ఆహారం తీసుకోవాలి.

జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగాలంటే... ఇలా చేయండి!

ఆంధ్రజ్యోతి(26-02-2022)

ఒత్తైన జుట్టు ఉండాలంటే.. ప్రొటీన్లు, విటమిన్లు ఉండే మంచి ఆహారం తినాలి. జుట్టు త్వరగా, పొడవుగా పెరిగేందుకు ఈ ఆహారం తీసుకోవాలి.

సాల్మన్‌: ఈ చేపలో ప్రొటీన్లు పుష్కలం. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి.

తాజా కూరగాయలు: వీటిలో ఫైబర్‌ అధికం. ఇందులో విటమిన్‌-సి ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటంతో పాటు కుదుళ్లు గట్టిగా ఉంటాయి.

నట్స్‌: ఈ గింజల్లో జింక్‌ ఉండటం వల్ల జుట్టు ఊడిపోయే సమస్య ఉండదు. 

పెరుగు: విటమిన్‌-బి వల్ల జట్టు వేగంగా పెరుగుతుంది. పెరుగును ‘డై’గా వేసుకుంటే ఆరోగ్యమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

కోడిగుడ్లు: ఇందులో ఎ, ఇ విటమిన్‌, బయోటిన్‌ ఉంటాయి. ఇది జుట్టుకు సూపర్‌ఫుడ్‌.

అవకాడో: విటమిన్‌-ఇ పుష్కలం. ఇందులోని యాటీ ఆక్సిడెంట్స్‌ జుట్టుకి డ్యామేజ్‌ కలగకుండా కాపాడతాయి. 

Updated Date - 2022-02-26T16:43:19+05:30 IST