పల్లెల్లో లైట్ల లొల్లి

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

పల్లెల్లో లైట్ల లొల్లి

పల్లెల్లో లైట్ల లొల్లి


  • వీధి దీపాల నిర్వహణ బాధ్యత ఈఈఎ్‌సఎల్‌కు
  • పంచాయతీల నుంచి తీర్మానాల సేకరణ
  • జిల్లాలో 30శాతం కూడా డీపీవోకు అందని తీర్మానాలు
  • ప్రైవేట్‌ వ్యక్తుల జోక్యంతో సర్పంచ్‌ల నిరసన!

తాండూరు, మే,16 : గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాల పేరిట విద్యుత్‌ వృఽథా అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్‌ఈడీ దీపాలు కొనుగోళ్లు వ్యవహారం పూర్తిగా ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా ఏడాదిన్నర క్రితం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం అమలుకు చర్యలు చేపట్టింది. ఎనర్జీ ఎఫీషియన్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థకు వీధి దీపాల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నారు. ప్రతి గ్రామపంచాయతీలో వీధి దీపాల ఏర్పాటు నిర్వహణలో భాగంగా ఎల్‌ఈడీ లైట్లు, వాటికి సంబంధించిన వస్తువులు, కంట్రోల్‌ బాక్సులు, వాటి నిర్వహణ బాధ్యత  ఏడేళ్ల వరకు ఇచ్చేందుకు గ్రామపంచాయతీల నుంచి తీర్మానాలను స్వీకరిస్తున్నారు. దీనికి అయ్యే మొత్తం ఖర్చును ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సంస్థ భరించనుంది. గ్రామపంచాయతీకి దీనికి సంబంధించి ముందస్తు పెట్టుబడి ఖర్చు ఉండదు. పెట్టుబడి ఖర్చు వచ్చే ఏడేళ్ల వరకు గ్రామ పంచాయతీ నిధి నుంచి ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీస్‌ లిమిటెడ్‌కు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం కమిషనర్‌, పంచాయతీరాజ్‌ శాఖ గ్రామపంచాయతీల్లో జమ చేసి నెలవారీగా వాయిదా నుంచి మినహాయించుకుని ఈఈఎ్‌సఎల్‌కు చెల్లించేందుకు పంచాయతీల నుంచి తీర్మానాలు సేకరిస్తున్నారు. ఒక్కో వీధి లైన్‌ నిర్వహణకు గాను రూ.3200 నుంచి రూ.4వేల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. వీధి లైట్ల సంఖ్య, వివరాలు పంచాయతీ తీర్మానం కాపీని డీపీవోలకు అందజేయాల్సి ఉంటుంది. కంపెనీ ఎల్‌ఈడీ బల్బులను మధ్యవర్తిత్వం ద్వారా కొనుగోలు చేసి స్థానికంగా ఉండే సిబ్బందితో పనులు చేయిస్తుంది. ఇదిలా ఉండగా, గ్రామపంచాయతీల్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం చేసుకోవడంపై సర్పంచ్‌లు నిరసన తెలుపుతున్నారు. పంచాయతీల నుంచి 30శాతం కూడా తీర్మానాలు డీపీవోకు అందలేదు.

పంచాయతీలను నిర్వీర్యం చేసేందుకే ఈ నిర్ణయం

గ్రామపంచాయతీల్లో వీధి దీపాలు, మురుగు కాల్వల నిర్వహణ వంటి ప్రధాన బాధ్యతలు, పంచాయతీ పాలకవర్గానికే ఉంటాయి. అయితే ప్రభుత్వం వీధి దీపాల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటికి పంచాయతీ నిధుల నుంచి వ్యయం చేసే నిర్ణయం సరైంది కాదు. పంచాయతీల నుంచి నిధులు ప్రతినెలా సేకరించి ఈఈఎ్‌సఎల్‌ సంస్థకు అందించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. అంచనాలకు మించి ఖర్చులు చూపుతూ గ్రామపంచాయతీల ఆదాయం కొల్లగొట్టేలా ఉంది. 

                                           - రాములమ్మ, సర్పంచ్‌, తట్టేపల్లి

బలవంతపెట్టడం లేదు

గ్రామాల్లో ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు విషయమై ముందుకు వచ్చే పంచాయతీల  నుంచే తీర్మానం తీసుకుంటున్నాం. ఎవరినీ బలవంత పెట్టడం లేదు. ఇప్పటి  వరకు జిల్లాలో 566 గ్రామపంచాయతీలు ఉండగా, 30శాతం తీర్మానాలు డీపీవో కార్యాలయానికి చేరలేదు. ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు ఎప్పటి నుంచి చేస్తారనే విషయం ప్రభుత్వం నుంచి ఆదేశం రావాల్సి ఉంది. విద్యుత్‌ పొదుపుగా వాడటంతోపాటు వృఽథాను అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.

                                                                 - మల్లారెడ్డి, డీపీవో, వికారాబాద్‌ జిల్లా

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST