Lollipop Day 2022: లాలీపాప్ కూ ఓ డే ఉంది.

ABN , First Publish Date - 2022-07-20T18:52:14+05:30 IST

మామూలు చాక్లెట్ లకి కాస్త భిన్నంగా కనిపించే లాలీపప్ ల వెనక చాలా కథే ఉంది. ఈ జూలై 20 నేషనల్ లాలీపప్ డే అట..

Lollipop Day 2022: లాలీపాప్ కూ ఓ డే ఉంది.

తీయగా నోరూరిస్తూ, రంగురంగుల ఆకారాల్లో కనిపించే లాలీపాప్ లంటే ఇష్టపడని వారంటూ ఉంటారా? మారాం చేసే పసిపిల్ల నుంచి కాలేజీ పిల్లల వరకూ పిల్లలు, పెద్దలని తేడాలేకుండా అందరికీ లాలీపాప్ ఇష్టమైన చాక్లెట్. వీటిని పంచదార పాకంతో గట్టిగా చేసిన పదార్థానికి స్టిక్ ని అతికించి తయారు చేస్తారు. చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మామూలు చాక్లెట్ లకి కాస్త భిన్నంగా కనిపించే లాలీపాప్ ల వెనక చాలా కథే ఉంది. ఈ జూలై 20 నేషనల్ లాలీపప్ డే అట.. మరి అందరూ ఇష్టపడే ఈ లాలీపాప్ ల కథేంటో తెలుసుకుందామా?


లాలీపాప్‌లు ఎప్పటి నుంచో ఏదో ఒక రూపంలో మనతోనే ఉన్నాయి. పూర్వ కాలంలో ఒక కర్రను ఉపయోగించి తేనెను సేకరించే క్రమంలో తేనెపట్టును కర్రతో కదిలించి తీసేవారు. ఆ తీపి పాకం కర్ర కు అంటుకుని గట్టిపడి కనిపించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి లాలీపాప్‌లుగా చెప్పచ్చు. పురాతన చైనీస్, ఈజిప్షియన్లు, అరబ్బులు కూడా పండ్లు, గింజలను తేనెతో కలిపి, సులభంగా తినడానికి ఆ మిఠాయిలో పుల్లలను గుచ్చి వాటిని ‘క్యాండీడ్’ గా తినేవారు. 17వ శతాబ్దంలో బ్రిటిష్ వారు చక్కెర పాకంతో స్వీట్ ని తయారుచేసే పద్దతిని మొదలుపెట్టారు. ఇంగ్లాండ్‌లో, 'నాలుక' ​​అనే పదం 'లాలీ' , పాప్ అంటే చప్పుడు - కలిపి 'లాలీ పాప్' అయింది. ఈ పదం లండన్‌లోని వీధి వ్యాపారుల నుంచి ప్రాచుర్యం పొందింది.


18వ శతాబ్దంలో లాలిపాప్‌ను తయారుచేసిన ఘనత  బ్రాడ్లీ స్మిత్ స్వీట్స్ కంపెనీది. అతను 1908లో లాలీపాప్స్ ని తయారు చేయడం మొదలుపెట్టాడు. 1931లో 'లాలీపాప్' అనే పదాన్ని ట్రేడ్‌మార్క్ చేశాడు. పిల్లలను ఆకర్షించడానికి లాలీపాప్‌లను 'డమ్ డమ్ సక్కర్స్' అని కూడా పిలిచేవారు. జూలై 20న జాతీయ లాలిపాప్ డే అన్ని వయసుల వారు సంబరంగా జరుపుకునే రోజు. 


లాలీపాప్‌ల విరివిగా తినడం 1908లో విస్కాన్సిన్, U.S.Aలో ప్రారంభమైంది. రేసిన్ కాన్ఫెక్షనర్స్ మెషినరీ కంపెనీ గంటకు 2,400 తయారు చేసే యంత్రాన్నిపరిచయం చేసింది. రష్యాకు వలస వచ్చిన శామ్యూల్ బోర్న్ కూడా 1916లో అదే పనిని చేసే ఒక యంత్రాన్ని కనిపెట్టాడు. అతని యంత్రాన్ని 'బోర్న్ సక్కర్ మెషిన్' అని పిలిచేవారు. శాన్ ఫ్రాన్సిస్కో ఆ సంవత్సరం 'కీ టు ది సిటీ'ని బోర్న్‌కి ప్రదానం చేసింది. ఇప్పుడు దేశ దేశాల్లో అన్ని ఆకారాలు, పరిమాణాలలో 100 రకాలకు పైగా లాలీపాప్‌లు అందుబాటులో ఉన్నాయి.


చూసారా.. మనం ఇష్టంగా తినే లాలీపాప్ ల వెనుక ఇంత కథ ఉంది...మొదటి లాలీపాప్ తేనె కర్రతో మొదలై, ఇప్పుడు రకరకాల ఆకారాల్లో, పరిమాణాల్లో దొరకుతున్నాయి. తీయ తీయగా ఈ వేడుకను మనమూ లాలీపాప్ తింటూ జరుపుకుందాం. 

Updated Date - 2022-07-20T18:52:14+05:30 IST