Elections: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎం, వీవీప్యాట్లను సిద్ధం చేయాలి

ABN , First Publish Date - 2022-08-27T18:32:14+05:30 IST

రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి ముందుగానే ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సన్నద్ధం చేయాలని

Elections: 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ఈవీఎం, వీవీప్యాట్లను సిద్ధం చేయాలి

                        - బీఈఎల్‌ అధికారులకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సూచన 


బెంగళూరు, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల సమయానికి ముందుగానే ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం), వీవీప్యాట్లను సన్నద్ధం చేయాలని కేంద్రప్రభుత్వ(Central Govt) రక్షణ రంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల తాజాస్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అనూ్‌పచంద్ర పాండే బెంగళూరు నగరానికి విచ్చేశారు. బీఈఎల్‌ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఈవీఎం, వీవీప్యాట్ల గణాంక వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే తమకు ఇచ్చిన ఆర్డర్‌ దాదాపు సిద్ధం కావస్తోందని అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం శుక్రవా రం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(State Election Commissioner)తోనూ, అధికారులతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాతోపాటు 2023 శాసనసభ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సన్నాహాల సమీక్ష నిర్వహించారు.

Updated Date - 2022-08-27T18:32:14+05:30 IST