‘లోకమాన్య తిలక్‌’ను పునరుద్ధరించాలి

ABN , First Publish Date - 2022-05-14T07:24:38+05:30 IST

కరీంనగర్‌-ముంబై లోకమాన్య తిలక్‌ రైలును పునరుద్ధరించాలని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పలు రైళ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

‘లోకమాన్య తిలక్‌’ను పునరుద్ధరించాలి

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరిన ఎంపీ అర్వింద్‌

పెద్దబజార్‌, మే 13: కరీంనగర్‌-ముంబై లోకమాన్య తిలక్‌ రైలును పునరుద్ధరించాలని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శుక్రవారం ఢిల్లీలో మంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఉన్న పలు రైళ్ల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధి నుంచి చాలామంది వలస కార్మికులు ముంబైకి వెళ్తారని రైలు రద్దుకారణంగా చాలామంది ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మంత్రికి వివరించారు. వారానికోసారి నడిచే బదులు రోజువారీగా లేదా వారినికి మూడుసార్లు నడిచేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. దీంతో అశ్విని వైష్ణవ్‌ లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.

Read more