మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్

ABN , First Publish Date - 2022-03-08T13:55:33+05:30 IST

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్

అమరావతి: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళామణులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇంట్లో ఆడబిడ్డలకే ర‌క్ష‌ణ లేదు.రాష్ట్రంలో ఉన్న ఆడపిల్ల‌ల‌కి ఇంకెక్క‌డి ర‌క్ష‌ణ‌?.వైసీపీ పాలనలో ప్ర‌క‌ట‌న‌ల్లో క‌నిపించే మ‌హిళా సంక్షేమం వాస్త‌వంలో ఉండ‌దు.అక్కాచెల్లెమ్మ‌ల మోముల్లో సంతోషం కోసం మ‌ద్య‌నిషేధం హామీఇచ్చిన జ‌గ‌న్‌రెడ్డి త‌న సొంత మ‌ద్యంతో మ‌హిళ‌ల పుస్తెలు తెంపేస్తున్నాడు. చెత్తపన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, నిత్యావ‌స‌రాల పెరుగుద‌ల‌తో ఇంటిని న‌డిపే మ‌హిళ‌లు ఘొల్లుమంటున్నారు. ఇంట్లో ఆడ‌బిడ్డ క‌న్నీరు ఆ ఇంటికి, రాష్ట్రంలో మ‌హిళ‌ల వేద‌న ఆ రాష్ట్రానికి మంచిది కాదు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం నుంచి అయినా మ‌హిళ‌ల భ‌ద్ర‌త, సంక్షేమం కోసం చిత్త‌శుద్ధితో ప‌నిచేసే బుద్ధి జ‌గ‌న్‌రెడ్డికి ఆయ‌న ప్ర‌భుత్వానికి ప్ర‌సాదించాల‌ని దేవ‌త‌ల‌ని ప్రార్థిస్తున్నాను’’ అని లోకేష్ తెలిపారు.

Updated Date - 2022-03-08T13:55:33+05:30 IST