Amaravathi: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) త్వరలో పాదయాత్రపై నిర్ణయం తీసుకోనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి పాదయాత్ర చేయాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతున్న లోకేష్.. సగానికిపైగా గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబు అక్టోబర్ 2వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు. అదే తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభిస్తే బాగుంటుందని పార్టీ శ్రేణులు లోకేష్‌కు చెబుతున్నట్లు సమాచారం. కాగా పాదయాత్ర ప్రారంభిస్తే మధ్యలో బ్రేక్ ఉండకూడదని లోకేష్ భావిస్తున్నారు. మంగళగిరిలో ఇంటింటికి తిరుగుతున్న కార్యక్రమం పూర్తి చేసి పాదయాత్రకు వెళ్లాలని లోకేష్ అనుచరులు భావిస్తున్నట్లు తెలియవచ్చింది.
ఇవి కూడా చదవండి