మే నెలలోని అన్ని పరీక్షలు రద్దు చేయాలి
ABN , First Publish Date - 2021-05-06T09:03:33+05:30 IST
కరోనా వ్యాప్తి దృష్ట్యా మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని లేకుంటే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు
సీఎం జగన్‌కు లోకేశ్ లేఖ
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి దృష్ట్యా మే నెలలో నిర్వహించాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని లేకుంటే రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి లోకేశ్ బుధవారం లేఖ రాశారు. మూడు వారాల ఆందోళన, న్యాయ పోరాటం అనంతరం పది, ఇంటర్ పరీక్షలు వాయిదా వేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.