అమరావతి: టీడీపీ హయాంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు. నడి వీధిలో చంద్రబాబును కాల్చి చంపాలనే జగన్ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేస్తూ ప్రశ్నలు సంధించారు. చంద్రబాబును బంగాళాఖాతంలో కలపాలని జగన్ అన్నారా? లేదా అనే దానిపై చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. ‘ముఖ్యకంత్రిని జైల్లో పెట్టి తన్నాలి’ అని జగన్ అనలేదా? అని ఆయన ప్రశ్నించారు.
కాగా సీఎం జగన్పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడులతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితులు మారాయి. రెండు పార్టీల నేతల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది.