అమరావతి: జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ ఎమ్మెల్సీలను ఉప ముఖ్యమంత్రి తిడుతుంటే జగన్ నవ్వుతూ చూస్తారా? అంటూ ప్రశ్నించారు. కల్తీసారా వాస్తవాలు బయటకొస్తాయని ప్రభుత్వం భయపడుతోందన్నారు. అన్నీ భయటకొస్తాయనే తమను దూషించి.. చర్చ నుంచి పారిపోతున్నారంటూ లోకేష్ దుయ్యబట్టారు. ఏపీలో లభ్యమయ్యే మద్యంలో రసాయనాలు ఉన్నాయనే ల్యాబ్ రిపోర్టులు తమ దగ్గర ఉన్నాయన్నారు. సభలో కల్తీసారా, జే బ్రాండ్‌లపై చర్చ వద్దంటే.. ఇంక దేనిపై చర్చలు జరుపుతారని లోకేష్ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి