అమరావతి: నాటుసారా మరణాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి చిత్రపటానికి జే బ్రాండ్ లిక్కర్ పోసి టీడీపీ శాసనసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు నిరసన తెలిపామన్నారు. కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అసెంబ్లీలో చర్చ జరపాలని, బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కల్తీ సారా, జే బ్రాండ్ల మరణాలపై న్యాయ విచారణకు అంగీకరించే వరకూ తమ పోరాటం ఆగదని నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి