జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన లోకేష్

ABN , First Publish Date - 2020-08-08T01:09:32+05:30 IST

టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి అరెస్టులను టీడీపీ నారా లోకేష్ ఖండించారు. కక్ష సాధింపులో భాగమే జేసీ కుటుంబంపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారని

జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన లోకేష్

అమరావతి: టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆయన తనయుడు అస్మిత్‌రెడ్డి అరెస్టులను టీడీపీ నారా లోకేష్ ఖండించారు. కక్ష సాధింపులో భాగమే జేసీ కుటుంబంపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ‘విడుదలైన 24 గంటల్లోపే మళ్లీ జైల్లో పెట్టా’ అని జగన్ సైకో ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రజల్ని గాలికొదిలేసి కరోనాని కూడా కక్ష సాధింపు కోసం వాడుకునే నీచ స్థితికి జగన్ దిగజారిపోయారని తప్పుబట్టారు. కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టి ఉంటే ఈ రోజు ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండేవి కావన్నారు. నేర స్వభావం ఉన్న జగన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత ప్రమాదమో.. ప్రస్తుత ఘటనలను చూస్తున్నామని లోకేష్ తెలిపారు.


తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకున్నారు. దీంతో ప్రభాకర్‌రెడ్డి, సీఐ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్రకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి రూరల్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డిపై 189,353,506 r/w 34 IPC 3(2)(va),3(1)r,3(1)s, sc,st poa act ,52 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కాగా.. ఇవాళ జేసీపై మొత్తం 5 కేసులు నమోదు చేసినట్లు తాడిపత్రి పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-08-08T01:09:32+05:30 IST