ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయనే లోకేష్‌ అక్రమ అరెస్ట్: ధూళిపాళ్ల

ABN , First Publish Date - 2021-09-09T20:06:25+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయనే టీడీపీ నేత లోకేష్‌‌ను అక్రమ అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయనే లోకేష్‌ అక్రమ అరెస్ట్: ధూళిపాళ్ల

అమరావతి: ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయనే టీడీపీ నేత లోకేష్‌‌ను అక్రమ అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనల పేరిట లోకేష్‌ను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని తప్పుబట్టారు. కొవిడ్ నిబంధనలు అధికార పార్టీ నేతలకు వర్తించవా? అని నరేంద్ర ప్రశ్నించారు. అన్యాయాన్ని, అక్రమాలను అడ్డుకుంటేనే కొవిడ్ నిబంధనలు వర్తిస్తాయా అని నిలదీశారు. పోలీసులు ప్రజల సేవకులా.. లేక ప్రభుత్వ సేవకులా? అని ప్రశ్నించారు. ఇకనైనా స్వామి భక్తిని చాలించి.. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ధూళిపాళ్ల నరేంద్ర హితవుపలికారు.

Updated Date - 2021-09-09T20:06:25+05:30 IST