ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సిద్ధం: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-05-09T08:49:20+05:30 IST

‘‘హింసించే పులకేశిరెడ్డి... నాపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో... నేను రెడీ. తెలుగుదేశం కార్యకర్త మారుతిపై హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ వాళ్లను ప్రశ్నించిన నాపై కేసు పెట్టిన పోలీసులు వైసీపీపై

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా సిద్ధం: లోకేశ్‌

అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ‘‘హింసించే పులకేశిరెడ్డి... నాపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో... నేను రెడీ. తెలుగుదేశం కార్యకర్త మారుతిపై హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ వాళ్లను ప్రశ్నించిన నాపై కేసు పెట్టిన పోలీసులు వైసీపీపై ఎందుకు కేసులు పెట్టరు? కరోనా కట్టడిలో విఫలమయ్యారని ఆరోపించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తప్పుడు కేసు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై కేసు, అక్రమ అరెస్టు, ఇప్పుడు మళ్లీ నాపై కేసులు...నువ్వు అధికారంలోకి వచ్చింది ప్రజల్ని రక్షించేందుకా? ప్రతిపక్షంపై కక్ష తీర్చుకునేందుకా?’’ అని నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ‘తెలుగుదేశం అధ్యక్షుడి నుంచి అభిమాని వరకూ... కార్యకర్త నుంచి కార్యదర్శి వరకూ... ఎవరూ నీ కేసులకు భయపడరు’ అని శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘మరోవైపు జగన్‌రెడ్డికి తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకంపై ఉన్న ఆరాటం..ప్రజల ఆరోగ్యంపై లేకపోవడం విచారకరం. మద్యం షాపుల ముందు మందు బాబులను జాగ్రత్తగా క్యూలలో పెట్టి భౌతిక దూరం పాటింపచేస్తున్న జగన్‌రెడ్డి... కరోనా వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు వచ్చిన జనాన్ని వదిలేసి కొవిడ్‌ వ్యాప్తికి మరింత కారణమవుతున్నారు’’ అని లోకేశ్‌ విమర్శించారు. 

Updated Date - 2021-05-09T08:49:20+05:30 IST