ఆ పదాలను నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్ స్పష్టీకరణ

ABN , First Publish Date - 2022-07-14T23:30:02+05:30 IST

అన్‌పార్లమెంటరీ పదాలంటూ కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన జాబితాలో తీవ్రస్థాయిలో

ఆ పదాలను నిషేధించలేదు: లోక్‌సభ స్పీకర్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: అన్‌పార్లమెంటరీ (Unparliamentary) పదాలంటూ కొన్ని పదాలను నిషేధిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన జాబితాలో తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ఉభయ సభల్లో తాము ఏ పదాన్నీ నిషేధించ లేదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) తాజాగా తెలిపారు. ఇలాంటి అన్‌పార్లమెంటరీ పదాలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారని, పేపర్లను వృథా చేయొద్దన్న ఉద్దేశంతో తాము దానిని ఇంటర్నెట్‌లో పెట్టామన్నారు. తామైతే ఏ పదాలను నిషేధించలేదని, తొలగించిన పదాల సంకలనాన్ని తాము విడుదల చేస్తామని ఓం బిర్లా తెలిపారు. 


‘‘అన్ పార్లమెంటరీ పదాలతో కూడిన 1,100 పేజీలున్న ఆ పుస్తకాన్ని వారు (ప్రతిపక్షాలు) చదివారా? వారు దానిని చదివి ఉంటే ఈ అపోహలు వ్యాప్తి చేసేవారు కాదు. 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో ఈ బుక్‌లెట్ విడుదలైంది. 2010 నుంచి వార్షిక ప్రాతిపదికన విడుదలవుతోంది’’ అని స్పీకర్ పేర్కొన్నారు. 


‘Bloodshed, 'bloody', 'betrayed', 'ashamed', 'abused', 'cheated, 'chamcha', 'chamchagiri', 'chelas', 'childishness', 'corrupt', 'coward', 'criminal' and 'crocodile tears', 'disgrace', 'donkey', 'drama', 'eyewash', 'fudge', 'hooliganism', 'hypocrisy', 'incompetent', 'mislead', 'lie', 'untrue', 'anarchist', 'gaddar', 'girgit', 'goons', 'ghadiyali ansu', 'apmaan', 'asatya', 'ahankaar', 'corrupt' వంటి ఇంగ్లిష్ పదాలతోపాటు చంచా, చంచాగిరి, అసత్య్, అహంకార్, గూన్స్, అప్‌మాన్, తానాషా, తానాషాహి, జైచంద్, వినాష్ పురుష్, ఖలిస్థానీ, ఖూన్ ‌సే ఖేటి, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని వంటి హిందీ పదాలు కూడా ఉన్నాయి. 


ఈ పదాలను నిషేధించినట్టు వార్తలు రాగానే ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ప్రభుత్వాన్ని విమర్శించే వారి సామర్థ్యాన్ని ఇది అడ్డుకుంటుందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో స్పందించిన స్పీకర్.. తాము ఏ పదాలను నిషేధించలేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-14T23:30:02+05:30 IST