సమావేశం నిర్వహిస్తున్న జడ్జి
మైదుకూరు, నవంబరు 30: డిసెంబరు 11న మైదుకూరు కోర్టు పరిధి లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కోర్టు సెక్రటరీ కవిత పేర్కొ న్నారు. మంగళవారం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రాధారాణి నిర్వ హించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కోర్టులో జరుగుతున్న వివాద కేసులపై ఇరుపక్షాల అంగీకారంతో మెగా లోక్‌అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చని ఎక్కువ కేసులు తీసుకురావాలని వారు కోరారు. సమావేశంలో కోర్టు పరిధిలోని ఎస్‌ఐలు సత్యనారాయణ, రఫీ, కుళాయప్ప, సుబ్బారావు, రాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.