కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌అదాలత్‌

ABN , First Publish Date - 2022-06-27T04:00:26+05:30 IST

కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌అదాలత్‌ అని, రాజీ మార్గమే రాజమార్గమని జిల్లా కోర్టు ప్రధాన జడ్జి సత్తయ్య అన్నారు. ఆదివారం కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదా లత్‌లో ఆయన మాట్లాడారు. కక్షిదారులు రాజీ కుదు ర్చుకుని కేసులను పరిష్కరించుకోవడం ద్వారా విలు వైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు.

కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌అదాలత్‌
లోక్‌ అదాలత్‌లో పాల్గొన్న జడ్జీలు

ఏసీసీ, జూన్‌ 26 : కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌అదాలత్‌ అని, రాజీ మార్గమే రాజమార్గమని  జిల్లా కోర్టు ప్రధాన జడ్జి సత్తయ్య అన్నారు. ఆదివారం  కోర్టు కాంప్లెక్స్‌లో నిర్వహించిన జాతీయ లోక్‌ అదా లత్‌లో ఆయన మాట్లాడారు. కక్షిదారులు రాజీ కుదు ర్చుకుని కేసులను పరిష్కరించుకోవడం ద్వారా విలు వైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చన్నారు.   జిల్లా అదనపు జడ్జి మైత్రేయి, ప్రధాన సీనియర్‌ సివిల్‌ జడ్జి ఉదయ్‌కుమార్‌, ప్రధాన జూనియర్‌ జడ్జి మహతి వైష్ణవి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు ఉప నిషద్వానీ, అసదుల్లా షరీఫ్‌, సుమన్‌గ్రేవాల్‌ల ఆధ్వ ర్యంలో ఏడు బెంచీలను ఏర్పాటు చేయగా 1617 కేసు లు, 2 బ్యాంకు కేసుల్లో రాజీ కుదిరి రూ.83.65 లక్షలు సెటిల్‌ అయినట్లు జిల్లా న్యాయసేవా సంస్థ  చైర్మన్‌ సత్తయ్య తెలిపారు.  మోటారు వాహనాల కేసులు, ఫ్యామిలీ కేసు లు, సివిల్‌, క్రిమినల్‌ తగాదాల్లో రాజీ కుదిరిందన్నారు. బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు, మంచిర్యాల కోర్టుల లో మొత్తం 3992 కేసులు, 10 బ్యాంకు కేసుల్లో రాజీ కుదిరి రూ.1కోటి1లక్ష74వేల196 రికవరీ అయ్యింద న్నారు. 

బెల్లంపల్లి: పట్టణంలోని కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని సివిల్‌ జడ్జి హిమబిందు ఆధ్వ ర్యంలో నిర్వహించారు. 990 పెండింగ్‌ కేసులను పరి ష్కరించినట్లు జడ్జి తెలిపారు. క్షణికావేశంలో తప్పులు చేసి కోర్టుల చుట్టూ తిరగవద్దని పేర్కొన్నారు.  బార్‌ అసోసియేసన్‌ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

లక్షెట్టిపేటరూరల్‌: ఇరు వర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించేందుకే లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.లక్ష్మణచారి పేర్కొన్నారు. లక్షెట్టిపేట కోర్టు ఆవరణలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. మొత్తం 752 కేసులను పరిష్కరిం చారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక దినోత్స వాన్ని పురస్కరించుకుని మత్తు పదార్థాలు వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పిం చారు. సెకండ్‌ క్లాస్‌ మెజిస్ర్టేట్‌ పాల్‌ సుధాకర్‌, బార్‌ అసోసియేసన్‌ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్‌కుమార్‌, ఏజీపీ పద్మ, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, పోలీసు లు, న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-27T04:00:26+05:30 IST