మిడతల దండు కలకలం

ABN , First Publish Date - 2020-05-29T08:11:23+05:30 IST

మిడతల దండు కలకలం

మిడతల దండు కలకలం

  • అనంతపురం జిల్లాపై దాడి చేసిన కీటకాలు
  • రాయదుర్గం, పెనుకొండ, గోరంట్లలో వందల సంఖ్యలో 
  • భారీగా జిల్లేడు చెట్లను నాశనం చేసిన మిడతలు
  • మిడత వాలితే మటాష్‌..!


రాయదుర్గం/ గోరంట్ల/ పెనుకొండ టౌన్‌, మే 28: మిడతల దండు అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. జిల్లాలోని రాయదుర్గం, గోరంట్ల, పెనుకొండలోని జిల్లేడు చెట్లపై గురువారం ఒక్కసారిగా వందలాది మిడతలు వాలడంతో జనం ఉలిక్కిపడ్డారు. తెల్ల జిల్లేడు మొక్కలపై వాలిన మిడతల దండు 2గంటల వ్యవధిలో ఆకులను పూర్తిగా తినేశాయి. దేశంలో మిడతల దండు తీవ్ర కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఒక్కసారిగా భారీగా మిడతలు వాలడం తీవ్ర ఆందోళన కలిగించింది. రైతులు పంటలను కాపాడుకునేందుకు పొలాల బాటపట్టారు.


వ్యవసాయాధికారులు వినోద్‌కుమార్‌, దస్తగిరిలు మిడతలు వాలిన జిల్లేడు చెట్లను పరిశీలించారు. వ్యవసాయ ఏడీ పుష్పలత కీటక శాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్త మురళీకృష్ణ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఇవి సాధారణ మిడతలేనని, వాటి నుంచి పంట పొలాలకు నష్టం లేదని స్పష్టం చేశారు. ఇవి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవి కావని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆశించిన మిడతల రకానికి, వీటికీ సంబంధం లేదని అన్నారు.


రాయదుర్గంలో జిల్లేడు ఆకులను తింటున్న మిడతలు

Updated Date - 2020-05-29T08:11:23+05:30 IST