కొమ్మికలో మిడతల కలకలం

ABN , First Publish Date - 2020-06-03T10:11:36+05:30 IST

మండలంలోని కొమ్మిక పంచాయతీలో మిడతలు కలకలం సృష్టించాయి. మిడతల దండులు విజృంభిస్తున్నట్టు ఇటీవల సోషల్‌ ..

కొమ్మికలో మిడతల కలకలం

జీడిమామిడి తోటలపై దాడి

చెట్లు ఆకులు తినేస్తున్న వైనం

ఆందోళన చెందుతున్న గిరి రైతులు


కొయ్యూరు: మండలంలోని కొమ్మిక పంచాయతీలో మిడతలు కలకలం సృష్టించాయి. మిడతల దండులు విజృంభిస్తున్నట్టు ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో మండలంలో కొమ్మిక పంచాయతీ తాళ్లపాలెం, కొమ్మిక, బొర్రంపేట గ్రామాల జీడిమామిడి తోటల్లో మిడతల గుంపులు దర్శనమిచ్చాయి. కొమ్మికకు చెందిన అమరపల్లి అప్పారావు, కమటం అప్పారావుల జీడిమామిడి తోటలతోపాటు బొర్రంపేటకు చెందిన జీడిమామిడి తోటల్లో ఆదివారం నుంచి మిడతల దండులు చెట్లు ఆకులను తినేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ గుంపులుగా ఇటువంటి కీటకజాతి పురుగులను చూడలేదని, ఇవి తోటలను సర్వనాశనం చేస్తున్నాయని రైతులు అంటున్నారు. వీటి నివారణకు వ్యవసాయ, ఉద్యాన శాఖలు తగిన సలహాలు, సూచనలు అందజేయాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-06-03T10:11:36+05:30 IST