గూగుల్‌ ఫోటోస్‌లో లాక్డ్‌ ఫోల్డర్‌

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

స్మార్ట్‌ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు గూగుల్‌ ఫోటోస్‌లో స్టోర్‌

గూగుల్‌ ఫోటోస్‌లో లాక్డ్‌ ఫోల్డర్‌

స్మార్ట్‌ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు గూగుల్‌ ఫోటోస్‌లో స్టోర్‌ అవుతుంటాయనే విషయం తెలిసిందే. అయితే కొంతమంది ఫోన్లో కొన్ని సీక్రెట్‌ ఫొటోలు లేదా వ్యక్తిగత ఫొటోలు ఉండే అవకాశం ఉంది. అవి అందరూ చూడటం ఎక్కువ మందికి ఇష్టం ఉండదు. అలాగైతే, గూగుల్‌ ఫొటోస్‌లో మన ఫొటోలు, వీడియోలను సీక్రెట్‌గా ఉంచుకునే వెసులుబాటు ఉంది. ఆండ్రాయిడ్‌ ఫోన్లలో బ్యాకప్‌ సర్వీసెస్‌ ప్రొవైడర్‌ ఉంది. దాంతో ఇతరులు తమ ఫొటోలు చూడకుండా చేయవచ్చు.


గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ ఫీచర్స్‌లో లాక్డ్‌ ఫోల్డర్‌ ఉంటుంది. అందులో సీక్రెట్‌ ఫొటోలు, వీడియోలను ఉంచుకోవచ్చు. పాస్‌ కోడ్‌ సహయంతో ఆ ఫోల్డర్‌ను ప్రొటెక్ట్‌ చేసుకోవచ్చు. లాక్డ్‌ ఫోల్డర్‌లోకి పంపుకొన్న ఫొటోలు, వీడియోలకు మాత్రమే గోప్యత  వర్తిస్తుందని గుర్తించాలి.  ఈ ఏడాది మే నెలలో ఆరంభమైన ఈ లాక్డ్‌ ఫోల్డర్‌ మొదట గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్లకే పరిమితం. అక్టోబర్‌ నెలాఖరుకి ఆండ్రాయిడ్‌ వినియోగదారులు అందరికీ అందుబాటులోకి తెచ్చారు. వచ్చే ఏడాదికల్లా ఐఓఎస్‌ ఫోన్లకూ అందుతుందని భావిస్తున్నారు. 

గూగుల్‌ ఫొటోస్‌ గ్రిడ్‌, మెమరీస్‌, సెర్చ్‌, ఆల్బమ్‌ లేదంటే ఇన్‌స్టాల్‌ చేసుకున్న యాప్స్‌లో లాక్‌ ఫోల్డర్‌లో ఉన్న ఫొటోలు కనిపించవు. మీ ఫోల్డర్‌ను అన్‌లాక్‌  చేయగలిగే యాక్సెస్‌ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే కేవలం వారు మాత్రమే చూడగలుగుతారు. 



గూగుల్‌ ఫొటోస్‌లో ‘లాక్డ్‌ ఫోల్డర్‌’లో ఫొటోలను దాచిపెట్టుకోవాలని అనుకుంటే...

 మీ ఫోన్‌లో గూగుల్‌ ఫొటోస్‌ను ఓపెన్‌ చేయాలి. 

లైబ్రరీ తరవాత యుటిలిటీస్‌లోకి వెళ్ళి ‘సెటప్‌ లాక్‌ ఫోల్డర్‌’ని టాప్‌ చేయాలి. 

అక్కడ కేరక్టరిస్టిక్స్‌ను సెలెక్ట్‌ చేసుకుని లాక్డ్‌ ఫోల్డర్‌ సెటప్‌ చేసుకోవాలి.

డివైస్‌ లాక్‌ స్ర్కీన్‌ మాదిరిగా ఫింగర్‌ ప్రింట్‌ అనలాక్‌, ప్యాటర్న్‌ ఆల్ఫా న్యూమరిక్‌ న్యూమరిక్‌ పిన్‌తో లాక్డ్‌ ఫోల్డర్‌ను ప్రొటెక్ట్‌ చేసుకోవాలి.

ఒకసారి పూర్తయితే మీదగ్గర ఉన్న ఫొటోలు, వీడియోలను వాటిని లాక్డ్‌ ఫోల్డర్‌కు పంపుకోవచ్చు. ముందే చెప్పినట్టు అవన్నీ లాక్‌ అవుతాయి. మీరు లేదంటే యాక్సెస్‌ ఉన్న వ్యక్తులకు మాత్రమే అవి అందుబాటులో  ఉంటాయి. మరెవ్వరూ చూసే వీలు ఉండదు. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST