సెప్టెంబర్‌ దాకా లాక్‌డౌన్‌!

ABN , First Publish Date - 2020-04-07T15:17:35+05:30 IST

భారత్‌లో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ దాకా పొడిగిస్తారన్న వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది...

సెప్టెంబర్‌ దాకా లాక్‌డౌన్‌!

సోషల్‌ మీడియాలో ‘నివేదిక’ వైరల్‌.. బోస్టన్‌ గ్రూప్‌ ఖండన

హైదరాబాద్‌: భారత్‌లో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్‌ దాకా పొడిగిస్తారన్న వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. భారత్‌లాంటి విశాల దేశంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలతో వైరస్‌ నియంత్రణ అసాధ్యమని, విధాన నిర్ణయాలూ ప్రభావశీలంగా లేవని మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ సంస్థ బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌ (బీసీజే) రూపొందించిన ఓ నివేదిక పేర్కొన్నట్లు ఆ వార్త సారాంశం. ఇది వైరల్‌ అయి కొన్ని వర్గాల్లో ఆందోళన రేపింది. జూన్‌ నెలాఖరుదాకా లాక్‌డౌన్‌ పొడిగించవచ్చని, దీనికి కారణం జూన్‌ రెండు, మూడు వారాలకు కరోనా విస్తరణ ప్రబలమై భారత్‌లో పతాకస్థాయికి చేరవచ్చని నివేదిక పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా మీడియా సమావేశంలో ఈ నివేదికను ప్రస్తావించడం విశేషం. అయితే ఈ వార్తలను బీసీజే ఖండించింది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై తామెలాంటి అంచనాలూ వెలువరించలేదని స్పష్టం చేసింది.  

Updated Date - 2020-04-07T15:17:35+05:30 IST