Lockdownలో 25 శాతం పెరిగిన కంటి వ్యాధులు

ABN , First Publish Date - 2022-02-11T15:38:12+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో థైరాయిడ్‌ కంటి వ్యాధులు 25 శాతం వరకూ పెరిగాయని డాక్టర్‌ అగర్వాల్‌ నేత్రవైద్యశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశ్విన్‌ అగర్వాల్‌ తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు

Lockdownలో 25 శాతం పెరిగిన కంటి వ్యాధులు

                               - డాక్టర్‌ అశ్విన్‌ అగర్వాల్‌


చెన్నై: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో థైరాయిడ్‌ కంటి వ్యాధులు 25 శాతం వరకూ పెరిగాయని డాక్టర్‌ అగర్వాల్‌ నేత్రవైద్యశాల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశ్విన్‌ అగర్వాల్‌ తెలిపారు. లాక్‌డౌన్‌లో ప్రజలకు కంటి సమస్యలు విపరీతంగా పెరిగాయని, థైరాయిడ్‌ కారణంగా కంటి వెనుక నరాలపై ఒత్తిడి అధికమైందని, సకాలంలో చికిత్స చేసుకోకపోవడం వల్ల చూపు బాగా దెబ్బ తింటున్నదని పేర్కొన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధైరాయిడ్‌ కారణంగా కంటి వెనుక, కంటి చుట్టూ ఉన్న కణజాలాలు ఉబ్టడం, కళ్ళల్లో అదేపనిగా నీరు కారటం, లేదా ఒక కన్ను ఎర్రబడటం వంటి సమస్యలు ఎదురైనట్టు తమ పరిశీలనలో వెల్లడైంద న్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్యలతో చికిత్స కోసం తమ ఆస్పత్రికి వచ్చే కంటి రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యల కారణంగా దీర్ఘకాలం దృష్టి లోపంతో బాధపడాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్‌ ప్రీతి ఉదయ్‌, డాక్టర్‌ ఎస్‌.సుందరి, డాక్టర్‌ దివ్యా అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-02-11T15:38:12+05:30 IST