సడలింపు సమయం కుదింపు?

ABN , First Publish Date - 2020-03-29T08:00:58+05:30 IST

లాక్‌డౌన్‌ సడలింపు సమయాలను కుదించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం, దీనివ్యాప్తి విస్తృతంగా ఉండడంతో...

సడలింపు సమయం కుదింపు?

  • త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న డీజీపీ

విజయవాడ, మార్చి 28(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సడలింపు సమయాలను కుదించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగడం, దీనివ్యాప్తి విస్తృతంగా ఉండడంతో ఉదయం 6 నుంచి9 గంటల వరకే లాక్‌డౌన్‌కు వెసులుబాటు ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క రైతుబజార్లలోనూ రద్దీ చాలా వరకు తగ్గిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట దాకా ఉండడం వల్ల మిగిలిపోయిన కూరగాయలు ఎండలకు పాడైపోతున్నాయని రైతులు వాపోతున్నారు. సమయాన్ని ఉదయం 8లేక 9గంటల వరకు కుదిస్తే మంచిదంటూ రైతులు... ఈ విషయాన్ని మార్కెటింగ్‌ శాఖ అధికారులకు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయిలోనూ చర్చ జరుగుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం వస్తుందని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ విజయవాడలో శనివారం వెల్లడించారు. లాక్‌డౌన్‌ సమయాలను ఉదయం 6గంటల నుంచి 9 గంటల వరకు సడలిస్తే సరిపోతుందని ప్రజలు తమకు సూచిస్తున్నారని ఆయన తెలిపారు.

Updated Date - 2020-03-29T08:00:58+05:30 IST