కొనసాగుతున్న కట్టడి

ABN , First Publish Date - 2020-04-04T10:30:19+05:30 IST

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 12వ రోజు శుక్రవారం కరోనా లాక్‌ డౌన్‌ కొనసాగింది. రైతు బజార్‌ను

కొనసాగుతున్న కట్టడి

12వ రోజుకు చేరిన లాక్‌ డౌన్‌

జిల్లా సరిహద్దులను సందర్శించిన ఎస్పీ చేతన

ఉద్యోగులకు కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి


నారాయణపేట/నారాయణపేట టౌన్‌/ నారాయణపేట క్రైం/మాగనూరు/మక్తల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 3 : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 12వ రోజు శుక్రవారం కరోనా లాక్‌ డౌన్‌ కొనసాగింది. రైతు బజార్‌ను ఏఎంసీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ సరాఫ్‌ నాగరాజు, చెన్నారెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ గట్టు విజయ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు సందర్శించారు. ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి స్వతహాగా రూ.4 లక్షల విలువ చేసే శానిటైజర్లు, మాస్క్‌లు, విటమిన్‌ సీ మాత్రలను జిల్లా ఉద్యోగులు, సిబ్బంది కోసం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతనలకు అందించారు. జిల్లాలోని సరిహద్దులోని కృష్ణ, సజనాపూర్‌, చేగుంట, కాన్‌కూర్తి, ఇట్లాపూర్‌, ఉల్లిగుండం, ఎక్లాస్‌పూర్‌, జిల్లాల్‌పూర్‌ చెక్‌ పోస్టులను ఎస్పీ చేతన పర్యవేక్షించారు. సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు అందించారు. అదేవిధంగా మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ హరి నారాయణ భట్టడ్‌ రూ.2లక్షల చెక్కును కలెక్టర్‌ హరిచందనకు అందించారు.


డీఎంహెచ్‌ఓ శైలజ, ఇన్సొలేషన్‌ జిల్లా అధికారి డా.సిద్ధప్పలు క్వారంటైన్‌ బాధితులను పర్యవేక్షించారు. కలెక్టరేట్‌లోని హెల్ప్‌లైన్‌ను  8 మంది ఆశ్రయించి వివిధ సేవలను అడిగి తెలుసుకున్నారు. సింగారం ఐసొలేషన్‌ కేంద్రంలో 11 మంది చికిత్స చేయించుకుంటున్నారు. మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ చెన్నారెడి ్డ సతీమణి, 8వ వార్డు కౌన్సిలర్‌ శిరీష రైతులకు, కొనుగోలు దారుల చేతులకు హ్యాండ్‌ వాష్‌ లిక్విడ్‌ వేసి చేతులు శుభ్రతపై అవగాహన కల్పించారు. వార్డులోనూ పర్యటించారు.14వ వార్డులో కౌన్సిలర్‌ విశాలాక్షి వెంకట్రాములు, 15వ వార్డులో కౌన్సిలర్‌ బండి రాజేశ్వరి శివరాం రెడ్డి, 2వ వార్డులో కౌన్సిలర్‌ అనిత జొన్నల సుభాష్‌లు ట్రాక్టర్ల ద్వారా ఆయా వార్డుల్లో కరోనా కీటకాల నివారణ మందును పిచికారి చేయించారు.


జిల్లా ఆసుపత్రిలో మాజీ కౌన్సిలర్‌ పోషల్‌ వినోద్‌, మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు జయమ్మ తదితరులు రోగులు వారి బంధువులకు అల్పాహారం పంపిణీ చేశారు. భీమండి కాలనీలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీ శ్యాంసుందర్‌,  ఆ పార్టీ రాష్ట్ర నేత రతంగ్‌ పాండురెడ్డి చేతుల మీదుగా అల్పాహారం పాకెట్లు అందజేశారు. నారాయణపేట రైతు బజార్‌లో 3వ వార్డు కౌన్సిలర్‌ సత్య రఘుపాల్‌ రెడ్డి రైతులకు పులిహోర పాకెట్లు పంపిణీ చేశారు. మాగనూర్‌ మండలం భైరంపల్లి గ్రామానికి చెందిన కుర్వ హన్మంతు కుటుంబం కొన్ని నెలల క్రితం బెంగుళూరుకు వలసవెళ్లారు. గురువారం రాత్రి వారు స్వగ్రామానికి రాగా, గ్రామస్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తమ సొంత పొలంలో గుడారం వేసుకొని ఉంటున్నారు.


ఆ కుటుంబానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సర్పంచు మంజులారాఘవేందర్‌, జడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీటీసీ ఎల్లారెడ్డి గుడారం సందర్శించిన వారిని పరామర్శించారు. మక్తల్‌లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఆజాద్‌సేవా సమితి ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు, ఆశ, రెవెన్యూ సిబ్బందికి లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ భీమా ఆధ్వర్యంలో తహసీల్దార్‌ నర్సింగరావు చేతుల మీదుగా అన్నం పొట్లాలు పంపిణీ చేశారు. లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు రవికుమార్‌, జోనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ శ్రీరాం పాల్గొన్నారు. పట్టణంలో ఎస్సై అశోక్‌కుమార్‌ పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో ఆజాద్‌  సేవా సమితి నాయకులు బాల్చెడ్‌ మల్లికార్జున్‌, సురేష్‌ కుమార్‌గుప్తా, శేషగిరి, రవీందర్‌, శ్రీధర్‌గౌడ్‌, విజయ్‌కుమార్‌, లయన్స్‌ క్లబ్‌ సభ్యులు అంబదాస్‌, కట్ట వెంకటేష్‌, డీవీ చారి, అక్కల సత్యనారాయణ, వాకిటి శ్రీహరి, శ్రీనివాస్‌గుప్తా, రాజేశేఖర్‌, సత్యనారాయణలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-04T10:30:19+05:30 IST