లాక్‌డౌన్‌ సంపూర్ణం

ABN , First Publish Date - 2020-03-29T10:06:24+05:30 IST

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి శనివారానికి 7వ రోజుకు చేరుకుంది. ప్రధాన రహదారులన్నింటినీ పోలీసులు మూసివేశారు.

లాక్‌డౌన్‌ సంపూర్ణం

ఆదోని(అగ్రికల్చర్‌), మార్చి 28: కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించి శనివారానికి 7వ రోజుకు చేరుకుంది. ప్రధాన రహదారులన్నింటినీ పోలీసులు మూసివేశారు. ప్రజలంతా గృహాలకే పరిమితమయ్యారు. ఏ ఒక్కరిని కూడా రోడ్డుపైకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారిని హైవేలోనే అడ్డుకొని వెనక్కి పంపుతున్నారు. పట్టణ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరు కూడా రోడ్డుపైకి రావడం లేదు.


నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో 6వ రోజు లాక్‌డౌన్‌ సంపూర్ణంగా సాగింది. పట్టణంలో 1గంటకు నిత్యావసర సరుకుల దుకాణాలు మూతపడ్డాయి. మెడికల్‌ దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచారు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడంతో పట్టణంలో ప్రధాన కేజీ రహదారి నిర్మానుష్యంగా మారింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. తమ గ్రామాల్లోకి ఎవరూ రావద్దంటూ ప్రజలు రోడ్లకు ముళ్లకంపలు అడ్డువేశారు. 


దేవనకొండ: దేవనకొండతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పోలీసులు రోడ్లపైకి ఎవరినీ రానివ్వడం లేదు. కూరగాయలు, నిత్యవసర సరుకులు తీసుకునేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి ఇచ్చా రు. నిత్యావసరాలు తీసుకునే సమయంలో ప్రజలు భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. ప్రతిరోజు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. జలుబు, దగ్గు, జ్వరం విపరీతంగా ఉంటే వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకోవాలన్నారు.

Updated Date - 2020-03-29T10:06:24+05:30 IST