లాక్‌డౌనే ఏకైక పరిష్కారం : రవిశంకర్ ప్రసాద్

ABN , First Publish Date - 2020-05-29T19:51:35+05:30 IST

దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు అందర్ని సంప్రదించిన తర్వాతే అమలులోకి తెచ్చామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు.

లాక్‌డౌనే ఏకైక పరిష్కారం : రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలు అందర్ని సంప్రదించిన తర్వాతే అమలులోకి తెచ్చామని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ పునరుద్ఘాటించారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతానికి మందు లేదని, లాక్‌డౌన్, ప్రార్థనలు ఒక్కటే మందులన్ని తెలిపారు. నిర్ణీత సమయంలో లాక్‌డౌన్‌ను విధించడంతోనే కరోనా మరణాలపై అదుపు సాధించామని అన్నారు. కేవలం ప్రాణాలను కాపాడటమే కాదని, ప్రజల బతకుదెరువును కూడా కాపాడాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.


ఇంత క్లిష్ట సమయంలో కూడా డిజిటల్ ఇండియా అన్న ఐడియా దేశాన్ని బలోపేతం చేస్తోందని, అలాగే దేశాన్ని అత్యంత నిజాయితీతో నడిపిస్తున్నామని ప్రకటించారు. ‘‘అత్యంత నిజాయితీతో ఉన్న ప్రజలతో దేశాన్ని నడుపుతున్నాం. ప్రభుత్వాన్ని ఎవరూ వెలెత్తి చూపకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నాం. కరోనాతో పోరాడటానికి తగిన చర్యలు తీసుకున్నాం. సకారాత్మక విమర్శపై తమకు పూర్తి నమ్మకం ఉంది’’ అని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-05-29T19:51:35+05:30 IST