Abn logo
Jul 3 2020 @ 05:02AM

మార్కాపురంలో లాక్‌డౌన్‌

నేటి నుంచి మూడు రోజులు అమలు

దుకాణాలన్నీ మూత

రెండువారాల్లో 80 పాజిటివ్‌ కేసులు.. రెండు మరణాలు

జిల్లాలో తగ్గన కరోనా ఉధృతి

భారీగా పెరుగుతున్న బాధితులు


మార్కాపురం, జూలై 2 : మార్కాపురంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో ఈ నెల 3, 4, 5 తేదీ ల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటివరకు సడలింపులతో కూడిన లాక్‌డౌన్‌ అమలు చేసినా కరోనాను ని లువరించలేకపోయారు. కేవలం గత రెండు వారాలో ్లనే 80 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడ్డాయి. ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. తొలుత మూ డురోజులపాటు లాక్‌డౌన్‌ అమలు చేయాలని ఎమ్మె ల్యే కుందురు నాగార్జునరెడ్డి, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, డీఎ స్పీ జి.నాగేశ్వరరెడ్డి, సీఐ కె.వి.రాఘవేంద్రలు గురువా రం జరిగిన సమావేశంలో ప్రకటించారు.


లాక్‌డౌన్‌లో నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిస్తే కేసులు నమోదు చేయడమే కాక అపరాధరుసుం విధించనున్నారు. మార్కాపురంలోకి ఇతర గ్రామాల నుంచి మూడు రోజులపాటు ప్రజల రాకపోకలను నిషేధించా రు. పొదిలిలో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అందులో 9 కేసులు మార్కాపురం నుంచి వ్యా పించినవే. దీంతో పట్టణంలోకి ఇతర ప్రాంతాల వా రిని రానీయకూడదని అధికారులు నిర్ణయించారు. సం పూర్ణ లాక్‌డౌన్‌ విధిస్తున్న నేపథ్యంలో నిత్యావసరాల డోర్‌డెలివరీకి నాలుగు సూపర్‌మార్కెట్లకు అనుమతి ఇచ్చినట్లు ఆర్డీవో ఎం.శేషిరెడ్డి తెలిపారు.


ప్రజలు జ యశ్రీ సూపర్‌మార్కెట్‌ 9849199396, సువిధ సూపర్‌మార్కెట్‌ 9440245681, హెరిటేజ్‌ సూపర్‌మార్కెట్‌ 91001 75953, కల్వకుంట సుబ్బారావు సూపర్‌మార్కెట్‌ 9989346150 నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. వీరు సరుకులను డోర్‌ డెలివరీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.  కాగా మార్కాపురం పోలీస్‌ సబ్‌డివిజన్‌ పరిధిలో జూలై 31వ తేదీ వరకూ 30 పోలీస్‌ యాక్ట్‌ అమలు చేస్తున్నట్లు డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


 క్వారెంటైన్‌ ఏర్పాటుకు చర్యలు

మార్కాపురంలో 1000 మందికి క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డీవో ఎం.శేషిరెడ్డి చెప్పారు. మండలంలోని రాయవరంలో ఆ సెం టర్‌ ఏర్పాటుకు బుధవారం ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ బాలిక జూనియర్‌ కళాశాల, కస్తూర్బా గాం ధీ గురుకుల బాలిక పాఠశాలలను ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సీహెచ్‌.రమేష్‌, ప్రిన్సిపాల్స్‌ రంగయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


ఒక్కరోజే 20 కేసులు..

మార్కాపురంలో గురువారం 20 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకరు మున్సిపల్‌ కార్యాలయ సిబ్బంది కాగా, మరో ఇరువురు వ్యవసా య మార్కెట్‌ కమిటీ పాలకవర్గంలో క్రియాశీల పదవిలో ఉన్న నాయకుని కుటుంబసభ్యులు. వీరికి రెండు రోజుల క్రితం మున్సిపల్‌ చైర్మన్‌ పదవికోసం రేసులో ఉన్న వ్యక్తి నుంచి కరోనా సోకినట్లు తేలింది. దీంతో సంబంధిత నాయకుని నుంచి ఎంతమందికి వచ్చి ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


చటపాలెంలో పాజిటివ్‌ కేసు 

చవటపాలెంలో కరోనా పాజి టివ్‌ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన వ్యక్తి విజ యవాడలో ఉంటూ ఇటీవల ఇంటికి చేరుకోవడంతో వీఆర్‌డీఎల్‌ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో గురువారం గ్రామంలో 50 మందికి స్వాబ్‌ తీశారు. దా సరివారిపాలెంలో ఒక పాజిటివ్‌ కేసు నమోదై వారం తిరగక ముందే చవటపాలెంలో రెండో కేసు నమోద వడంతో మండల వాసులు ఉలిక్కిపడ్డారు.  గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. 


చీరాలలో మరో రెండు..

పట్టణంలో గురువారం ఇద్దరికి కరోనా పా జిటివ్‌ నిర్ధారణ అయింది.  కేసులు వచ్చిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించారు. మున్సిపల్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 


కంటైన్‌మెంట్‌గా కొప్పెరపాడు

మండలంలోని కొప్పెరపాడులో కరోనా కేసులు నమోదు కావడంతో గ్రామాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించినట్లు నియోజకవర్గ ప్రత్యేకాధికారి అంజలి గురువారం తెలిపారు. 


 చెరుకూరులో ఆరోగ్య సిబ్బందికి.. 

చెరుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరికి గురువారం కరోనా పాజిటివ్‌గా అధికారులు ప్రకటించారు.  ఆరోగ్య సి బ్బందికి సైతం కరోనా వ్యాప్తి చెందడంతో ప్రజలు భ యాందోళనకు గురవుతున్నారు.  ఇప్పటికే పర్చూరును కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించిన అధికారులు ఆంక్షల ను మరింత కట్టుదిట్టం చేశారు. 


28 మందికి పాజిటివ్‌

మండలాన్ని కరోనా వణికిస్తోంది. తా జాగా పట్టణంలో గురువారం 28 మందికి కరోనా పా జిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. మండలంలో ఈ సంఖ్య 75కు చేరింది ఇప్పటి వరకు పామూరు పట్టణంలో 14 కేసులు నయోదయ్యాయి. తాజాగా 28 కేసులతో 42కు చేరింది. వీటిల్లో నాలుగు మరణాలు ఉన్నాయి. కాగా, మండలంలోని బొట్లగూడూరు, కమ్మ వారిపాలెం, రఘునాఽథపురంలో శానిటైజేషన్‌ చేశారు. 


 పాజిటివ్‌ వ్యక్తి మృతి : పట్టణంలోని కనిగిరి రోడ్డులో నివాసం ఉంటున్న 67 సంవత్సరాల వ్యక్తి ఒంగోలులోని క్వారంటైన్‌ లో చికిత్స పొందుతూ గు రువారం సాయంత్రం మృతి చెందారు. దీంతో పా మూరులో కరోనా మృతుల సంఖ్య 5కు చేరింది. కాగా,  పట్టణంలో కరోనా మరణాలు సంభవించడం దుర దృష్టకరమని ఎమ్మెల్యే మధుసూదన్‌యాదవ్‌ అన్నారు. 

 

రెడ్డినగర్‌లో యువకుడికి..

మండలంలోని రెడ్డినగర్‌లో గురు వారం మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు వైద్యాధికారి మనోహర్‌రెడ్డి తెలిపారు. కరోనా సోకిన యువకుడిని ఒంగోలు రిమ్స్‌కు తరలించినట్లు చెప్పా రు. బాధితుడు లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఇటీవల మ హారాష్ట్ర వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో పలువురితో కలిసి తిరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా మండలంలోని రెడ్డినగర్‌, చం ద్రగిరి, ముండ్లమూరు గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లు గా ప్రకటించినట్లు తహసీల్దార్‌ పార్వతి తెలిపారు. 

 

అలవలపాడులో మరో రెండు..

అలవలపాడు గ్రామంలో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి ప్రవీణ్‌ తెలిపారు. రెండు రోజుల క్రితం అలవలపాడు, కల్లూరు గ్రామాల్లో రెండు పాజిటివ్‌ కేసులు నమో దయ్యాయి. వారిరువురు, వారితో సంబంధాలు ఉన్న కుటుంబ సభ్యులను ఒంగోలుకు తరలించారు. గ్రామంలో పాజిటివ్‌ వచ్చిన వారి కుటుంబ సభ్యులలో మ రో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యింది. కల్లూరు గ్రామంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కుటుంబ సభ్యుల పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని వైద్యాధికారి తెలిపారు. కాగా కల్లూరులో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో సం బంధాలు ఉన్న వ్యక్తులు 39 మందికి గురువారం శ్వా బ్‌ సేకరించి ఒంగోలుకు పంపారు. 


కనిగిరిలో మరో కేసు.. 

పట్టణ సమీపంలోని కొత్తూరుకు చెందిన  యువకుడికి కరోనా పాజిటీవ్‌ కేసు నమోదై నట్లు డాక్టర్‌ ఎన్‌నాగరాజ్యలక్ష్మి, ఎస్‌ఐ శివన్నాయ ణ రెడ్డి తెలిపారు. బాధితుడిని ఐసోలేషన్‌కు తరలించేం దుకు చర్యలకు ఉపక్రమించారు. 

Advertisement
Advertisement
Advertisement