లాక్ డౌన్ మధ్య నేడు చారిత్రక అమృతాంజన్ బ్రిడ్జి కూల్చివేత

ABN , First Publish Date - 2020-04-04T17:49:02+05:30 IST

మహారాష్ట్రలోని లోనావ్లా సమీపంలోని చారిత్రాత్మక అమృతాంజన్ వంతెనను శనివారం కూల్చివేయనున్నారు. 187 సంవత్సరాల

లాక్ డౌన్ మధ్య నేడు చారిత్రక అమృతాంజన్ బ్రిడ్జి కూల్చివేత

ముంబై: మహారాష్ట్రలోని లోనావాలా సమీపంలోని చారిత్రాత్మక అమృతాంజన్ వంతెనను శనివారం కూల్చివేయనున్నారు. 187 సంవత్సరాల పురాతన వంతెన ముంబై - పూణేలను కలుపుతుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ  వంతెన కూల్చివేసేందుకు మహారాష్ట్ర రహదారి అభివృద్ధి సంస్థ (ఎంఎస్‌ఆర్‌డిసి) కు రాయ్‌గ జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. ఈ వంతెనను బ్రిటిష్ కాలంలో 1830 లో నిర్మించారు. కోవిడ్ -19 కారణంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది ఈ వంతెన కూల్చివేత నేపథ్యంలో 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ మళ్లించనున్నారు. అమృతాంజన్ వంతెనపై  గత కొన్నేళ్లుగా వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఈ వంతెనను కూల్చివేసేందుకు అనుమతి కోరుతూ ఎంఎస్‌ఆర్‌డిసి గతంలో భారత రైల్వేశాఖకు లేఖ రాసినట్లు ఆ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-04-04T17:49:02+05:30 IST