Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 20 2021 @ 17:04PM

ఏప్రిల్ 22 నుంచి లాక్‌డౌన్.. ప్రకటించిన సీఎం

రాంచీ: జార్ఖండ్‌లో ఏప్రిల్ 22 నుంచి 29 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మంగళవారం ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తసుకున్నట్లు జార్ఖండ్ ప్రభుత్వం పేర్కొంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. అయితే అత్యవసర సర్వీసులకు లాక్‌డౌన్‌లో అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.


లాక్‌డౌన్ ముఖ్యాంశాలు..

ఏప్రిల్ 22 నుంచి 29 వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్.

అత్యవసర సర్వీసులు, వాటికి అనుబంధంగా ఉన్న సర్వీసులు మినహా మిగిలిన వ్యాపారాలన్నీ మూసే ఉంటాయి.

మతపరమైన ప్రార్థనా స్థలాలు తెలిచే ఉంటాయి కానీ, భక్తులకు అనుమతి ఉండదు.

వ్యవసాయ, మైనింగ్, నిర్మాణ రంగాల పనులు కొనసాగడానికి అనుమతి ఉంటుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహా ఇతర కార్యాలయాలు కూడా మూసి ఉంటాయి.

ఐదుగురికి మించి సమావేశం కాకూడదు.


సోమవారం జార్ఖండ్‌లో 3,992 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,33,479కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28,010. ఇక సోమవారం కోవిడ్ కారణంగా 50 మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ మృతుల సంఖ్య 1,456కు చేరుకుంది.

Advertisement
Advertisement