మరో నెల

ABN , First Publish Date - 2020-05-31T11:29:35+05:30 IST

కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. వచ్చేనెలాఖరు వరకూ కొనసాగిస్తూ శనివారం రాత్రి హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ

మరో నెల

జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు

కంటైన్‌మెంట్‌ప్రాంతాల్లో  కట్టడే

ఇతర మరికొన్ని చోట్లా సడలింపులు

స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు 


ఒంగోలు, మే 30 (ఆంధ్రజ్యోతి) : కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను కేంద్రం పొడిగించింది. వచ్చేనెలాఖరు వరకూ కొనసాగిస్తూ శనివారం రాత్రి హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంకన్నా మరికొన్ని సడలింపులను ప్రకటించింది. అదేసమయంలో కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కఠినం గానే అమలు చేయాలని సూచించింది. మార్చి 25 నుంచి ఈనెల 31వరకూ నాలుగు విడతలుగా లాక్‌డౌన్‌ను కేంద్రం అమలు చేస్తు న్న విషయం విదితమే. నాల్గో విడత  లాక్‌డౌన్‌ ఆదివారం ముగి యనున్న నేపథ్యంలో దాన్ని వచ్చేనెల 30 వరకూ పొడిగిస్తూ శని వారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. అందుతున్న సమాచారం మేరకు పాజిటివ్‌ కేసులు ఉండి కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో నిబంధనలు కఠినంగానే అమలు కానున్నాయి.


ఇతర ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఇస్తున్న వాటితోపాటు మరికొన్నింటిని సడలించనున్నారు. హోటళ్లు, మాల్స్‌, రెస్టారెంట్లు, ప్రార్థనా మంది రాలు, ఆలయాలను మాత్రం జూన్‌ 8నుంచి అనుమతించనున్నట్లు సమాచారం. విద్యా సంస్థలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిం చి జూలైలో తెరవాలని కేంద్రం సూచించింది. సినిమా హాళ్లు, రవా ణా ఇతరత్రా అంశాలను రాష్ట్ర ప్రభుత్వమే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండ గా జిల్లాలో 67వ రోజైన శనివారం కూడా లాక్‌డౌన్‌ కొనసాగింది.

Updated Date - 2020-05-31T11:29:35+05:30 IST