Abn logo
Mar 27 2020 @ 00:27AM

పకడ్బంధీగా లాక్‌డౌన్‌ అమలు

సూళ్లూరుపేట, మార్చి 26 : సూళ్లూరుపేటలో లాక్‌డౌన్‌ను అధికారులు, పోలీసులు గురువారం పకడ్బంధీగా నిర్వహించారు. బజారులో రద్దీని నివారించేందుకు కూరగాయలు, పండ్ల విక్రయాలను జూనియర్‌ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేశారు. అలాగే రైల్వేలైన్‌కు తూర్పువైపు నివసించే ప్రజలకు రైతు బజార్‌ ఏర్పాటు చేసి ప్రజలు దూరం దూరంగా క్యూలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం శుక్రవారం నుంచి ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుకాణాలు తెరచి ఉంచుతారన్నారు. ఆ సమయంలో నిత్యవసరాలను కొనుగోలు చేసుకోవాలని కమిషనర్‌ నరేంద్రకుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement
Advertisement
Advertisement