ఎఫ్‌ఎంసీజీ జోష్‌

ABN , First Publish Date - 2020-08-12T06:12:19+05:30 IST

లాక్‌డౌన్‌ ప్రభావం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై పెద్దగా పడలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీలు నమోదు చేసిన అమ్మకాలే ఇందుకు నిదర్శ నం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు పరిమాణ...

ఎఫ్‌ఎంసీజీ జోష్‌

రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో అమ్మకాలు


న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ ప్రభావం ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై పెద్దగా పడలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీలు నమోదు చేసిన అమ్మకాలే ఇందుకు నిదర్శ నం. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు పరిమాణ (వాల్యూమ్‌)పరంగా 4.3 శాతం, విలువపరంగా 8.5 శాతం వృద్ధి రేటు నమోదు చేశాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధిక వృద్ధి రేటని కన్సల్టెన్సీ సంస్థ ‘కాంటార్‌’ నివేదిక తెలిపింది. 

రెండంకెల వృద్ధి రేటు: ఎఫ్‌ఎంసీజీ రంగంలో పర్సనల్‌కేర్‌ వస్తువుల అమ్మకాల వృద్ధి రేటు మరింత ఎక్కువగా ఉంది. కరోనా ముప్పు నుంచి రక్షించుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఈ వస్తువులను కొనుగోలుకు ఎగబడ్డారు. దీంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఈ రంగంలో 11.1 శాతం వృద్ధి రేటు నమోదైంది. డిటర్జెంట్లు, సర్ఫేస్‌ క్లీనర్ల వంటి అమ్మకాలూ 4.6 శాతం వృద్ధి రేటు నమోదు చేశాయి.

పానీయాల అమ్మకాలు ఢమాల్‌: మరోవైపు కరోనా భయంతో శీతల పానియాల జోలికి పోలేదు. దీంతో గత ఏడాది ఇదేకాలంతో పోలిస్తే వీటి అమ్మకాలు 19 శాతం పడిపోయాయి. ఇదే సమయంలో ఆహార ఉత్పత్తుల అమ్మకాలు మాత్రం 5.7 శాతం పెరిగాయి. 

అన్ని ప్రాంతాల్లో గిరాకీ: లాక్‌డౌన్‌ సమయంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ ఎఫ్‌ఎంసీజీ వస్తువులకు గిరాకీ ఏర్పడింది. కాకపోతే గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతా ల్లో ఈ గిరాకీ మరింత ఎక్కువగా కనిపించిందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మొత్తం ఎఫ్‌ఎంసీజీ అమ్మకాల్లో 38 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని తెలిపింది. 



Updated Date - 2020-08-12T06:12:19+05:30 IST